తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీసి రాజకీయ నాయకులకు వరం ఇచ్చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ బీసీ నేతలకు వంద సీట్లు కేటాయిస్తుందని ఆయన చెప్పారు. పార్టీకి బిసీలు దూరమవుతున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ వరాన్ని ప్రదానం చేశారు.తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహంలోకి వెళుతోంది. వెనుకబడిన తరగతులవారికి (బిసి)అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి వ్యూహ రచన చేసుకుంటోంది. అందులో భాగంగా బిసి నాయకులతో చంద్రబాబు నాయుడు సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. బిసిలకు వచ్చే ఎన్నికలలో వంద సీట్లు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే బిసిలకు పదివేల కోట్ల బడ్జెట్ ను ప్రత్యేకంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
అలాగే బిసిలకు చట్ట సభలలో ముప్పై మూడు శాతం సీట్లు కేటాయించడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.అలాగే కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రి ఉండాలని కూడా సూచించారు. ఏడాది ముందే అభ్యర్దులను ప్రకటించే విషయంపై కూడా దృష్టి పెట్టారు. గత ఉప ఎన్నికలలో బిసిలు కూడా తమకు అంత ఆదరణ చూపలేదని ఆ పార్టీ నేత దేవేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో బిసిలను తిరిగి తమ పార్టీవైపు ఆకర్షించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టడానికి టిడిపి సన్నద్దమవుతోందని భావించాలి.అయితే కేవలం సీట్లు ఇచ్చినంతమాత్రాన సరిపోతుందా అన్న ప్రశ్న కూడా ఉంది. గత సాధారణ ఎన్నికలలో ప్రజారాజ్యం తరపున చిరంజీవి నూటనాటుగు మంది బిసిలకు సీట్లు ఇచ్చినా విజయం సాధించలేకపోయారు. అభ్యర్ధుల ఎంపిక కూడా ముఖ్యమైనదే. అయితే బడ్జెట్ తదితర అంశాలు, బిసిల పట్ల పార్టీకి శ్రద్ద ఉందన్న నమ్మకం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more