వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మరో ఛార్జీషీట్ దాఖలు చేసింది. తొలి ఛార్జీషీట్‌కు అనుబంధంగా నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. ఒక్కో ఛార్జీషీట్ ఒక్కో కంపెనీపై దాఖలు చేస్తోంది. తాజా అనుబంధ ఛార్జీషీట్ హెటెరో డ్రగ్స్ వ్యవహారంపై ఇచ్చింది. ఈ ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ జగన్ పైన మరో కేసు నమోదు చేసింది. పిసి యాక్ట్ సెక్షన్ 9 క్రింద ఈ కేసును నమోదు చేశారు. వైయస్ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాధికారులను ప్రభావితం చేశారని సిబిఐ తాజా ఛార్జీషీటులో పేర్కొంది. జగన్ కంపనీలలోకి లంచాల రూపంలో పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. హెటరో తదితర కంపెనీలు జగన్ కంపెనీలలో రూ.146 కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి కి చెందిన కంపెనీలలో హెటిరో డ్రగ్స్ పెట్టిన ముప్పై ఐదు కోట్లు పెట్టుబడి లంచాల కింద వచ్చిందేనని సిబిఐ అభియోగం మోపుతోంది. ఈ ఫార్మా కంపెనీలకు భూములను కేటాయించడంలో జగన్ పాత్ర ఉందని, తద్వారా , దానికి బదులుగా జగన్ కంపెనీలలో ఆ సంస్థ ముప్పై ఐదు కోట్లు వెచ్చించిందని సిబిఐ తాజాగా కోర్టులో దాఖలు చేసిన అనుబంద ఛార్జీషీట్ లో పేర్కొంది. అయితే ప్రభుత్వపరంగా వచ్చిన హెటిరో సంస్థకు వచ్చిన భూమి విలువ ఇరవై కో్ట్లు కూడా ఉండదని, అలాంటప్పుడు ముప్పై ఐదు కోట్లు లంచంగా ఇంచిందని సిబిఐ ఎలా చెబుతుందని ఇంతకు ముందు జగన్ తరపున వాదించేవారు అంటుండేవారు. ఈ భూముల విలువ ఎంత ఉందో, పెట్టుబడుల కన్నా ఎక్కువగా భూముల విలువ లేకుంటే నిజంగానే దానిని లంచంగా సిబిఐ ఎలా నిరూపించగలుగుతుందన్న ప్రశ్న వస్తుంది.
అలాగే ప్రభుత్వ వ్యవహారాలలో జగన్ ఎలా జోక్యం చేసుకుని భూమిని ఇప్పించారన్నది కూడా రుజువు కావల్సి ఉంటుంది. అదే సమయంలో అసలు ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వడం తప్పా? ఒప్పా అన్నది కూడా తేలవలసి ఉంటుంది. సిబిఐ ఈ విషయంలో ఎలా తప్పని చెబుతుందో తెలియదు. ఇక్కడే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమి కేటాయింపు తప్పు అని చెప్పగలిగితే అప్పుడు జగన్ కంపెనీలోకి లంచం వచ్చిందన్న అభిప్రాయానికి ఆస్కారం ఉంటుంది. అదే సమయంలో అలా తప్పు జరిగితే ఒక్క జగనే కాకుండా అందుకు సహకరించిన అదికారులు, మంత్రులు కూడా బాధ్యులు అవుతారు. ఈ చిక్కు ఉండడంతోటే ప్రభుత్వం మాట్లాడకుండా వ్యవహరిస్తోంది.ప్రభుత్వంలో ఉన్నవారితో సంబంధం లేకుండా జగన్ ఒక్కడే ఎలా చేస్తారన్న ప్రశ్నకు సమాదానం దొరకవలసి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more