వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీ బయలుదేరిని విషయం తెలిసందే. అయితే ఆమె ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో భేటీ కానున్నారా?లేక ఇక ఎవరితోనైన భేటీ కానున్నారా అనే అనుమానాలు కాంగ్రెస్ నాయకుల్లో తలెత్తుతున్నాయి. జగన్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విజయమ్మ ప్రధానికి పిర్యాదు చేయనున్నారని జగన్ పార్టీ నాయకులు అంటున్నారు.
తన తనయుడి అరెస్టు అక్రమమని, రాజకీయంగా జగన్ను ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ప్రధానికి వివరించి చెబుతారని తెలుస్తోంది. జగన్ ఆస్తులపై కక్షతో కాకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆమె కోరుతుందట.కాగా వైయస్ విజయమ్మతో పాటు ప్రధానమంత్రిని కలిసేందుకు మరో ఐదుగురు నేతలకు మాత్రమే అనుమతి లభించింది. పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సబ్బం హరి, శాసనసభ్యులు శోభా నాగి రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు, వైవి సుబ్బారెడ్డి తదితరులు ఆమెతో పాటు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధానితో పాటు పలువురు ఢిల్లీ పెద్దలను వారు కలవనున్నారు. కాగా తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని విజయమ్మ ఇటీవల ప్రధానిని కోరింది. అయితే విజయమ్మ ఢిల్లీ వెళ్లటం పై అనేక అనుమానాలు ఉన్నాయాని టీడీపీ నాయకులు అంటున్నారు. తన కొడుకు కోసం కాంప్రమైజ్ చేసుకోవటానికే .. ఈ ఢిల్లీ టూర్ అని టిడిపి నాయకులు అంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ,ఢిల్లీ వేదికగా బల ప్రదర్శనకు సిద్దమవుతోందనే ఊహగానాలు విన్పిస్తుండడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ప్రణబ్ కి మద్దతివ్వాలా? సంగ్మాకి మద్దతివ్వాలా? అన్న విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రణబ్కి ఓటేయాలంటే.. అంటూ జగన్ విషయంలో కొన్ని షరతుల్ని కాంగ్రెస్ పార్టీ ముందుంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ చాటుమాటుగా ప్రయత్నిస్తోందననే వాదనలూ లేకపోలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లే , చాటు మాటుగా కాంగ్రెస్ పెద్దలతో ఆయన మీటింగులు పెడుతున్నారని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ , ఇప్పుడు తాము ఢిల్లీ వెళ్తోన్న దరిమిలా, తమపై వ్యక్తమవుతున్న అనుమానాలు ఆరోపణలకు ఎలా సమాధానమిస్తారో ఏమో.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more