కాంగ్రెస్ అధిష్ఠానానికి సవాలుగా మారిన తెలంగాణ అంశం ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కలిసొస్తోంది. ఆయన పదవికి ముప్పు రాకుండా రాష్ట్ర విభజన అంశం శ్రీరామ రక్షగా మారింది. అందుకే కిరణ్ తన పదవికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమాగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అంశం తేలే వరకు కిరణ్ కుర్చికి ఢోకా లేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో పెను మార్పులు తప్పవు. పిసిసి అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా మార్చే అవకాశాలున్నాయి. ఇక ఆయన ఇంటికి వెళ్లడం తప్పుదు. ఇవి ఈ మధ్య డిల్లీకి వెళ్లి వచ్చిన రాష్ట్ర నాయకులు చెబుతున్న మాటలు. కాని డిల్లీ పెద్దల మనసులో మాత్రం అలాంటి ఆలోచన లేదని సీనియర్ నాయకులు అంటున్నారు. కిరణ్ విషయంలో అధిష్ఠానం కొంత అసహనంగా ఉన్నప్పటికీ ఆయన పదవికి ఎలాంటి ముప్పులేదని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో కిరణ్ కన్నా సమర్థులైన నాయకులు లేరని, సీఎంను మార్చితే మరిన్ని కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశముందని చెబుతున్నారు. అందుకే హైకమాండ్ సీఎంను మార్చే సాహసం చేయడం లేదని నేతలంటున్నారు. కొన్ని
రోజులుగా సిఎం మార్పు ఉంటుదని జోరుగా సాగుతున్న వార్తలను ముఖ్యమంత్రి కిరణ్ తేలిగ్గాతీసుకున్నారు. దీనికి కారణం తెలంగాణపై అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకోలేక పోవడమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అయితే.. తెలంగాణపై అధిష్ఠానం ఓ నిర్ణయానికి రాలేదు. అలా అని రాష్ట్రవిభజన డిమాండ్ ను కొట్టిపారేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదు. కొత్తగా రాయల తెలంగాణ అంశం తెరపైకి రావడంతో తెలంగాణ సమస్య 2014 వరకు తేలదని అప్పటిదాకా సీఎం కుర్చీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ఎటూతేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ త్వరలోనే సమస్యకు ముగింపు పలుకుతామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నందున తెలంగాణ అంశం ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డికి శ్రీరామ రక్షగా మారింది. అందుకే తనపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా ముఖ్యమంత్రి ధైర్యంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more