గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ భాగోతం మొత్తంగా బయటపడింది అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో అరెస్టై జైలు శిక్షను అనుభవిస్తోన్న గాలిజనార్దన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు గత ఏడాది చివరి నుంచి అతని అనుచరులు అన్ని ప్రయత్నాలు చేశారు. మాజీ న్యాయమూర్తి చలపతిరావుతో పాటు, ఎన్నికల సంఘంలో ప్రభాకర్ రావు గాలికి బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. సిబిఐ జడ్జిగా బాధ్యతలు చేపట్టక ముందు ఏసిబి జడ్జిగా పని చేసిన పట్టాభి లా కాలేజీ మిత్రుడు చలపతిరావు ద్వారా పదిలక్షల లంచం తీసుకుని అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన ఓఎస్డీ సర్వేశ్వర రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్లు వెల్లడైంది. ఇక గాలికి బెయిల్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘంలో న్యాయాధికారిగా పనిచేస్తోన్న ప్రభాకర్ రావు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ కోసం సిబిఐ జడ్జి పట్టాభిరామారావును సంప్రదించినట్లు ఏసిబి దర్యాప్తులో వెల్లడైంది. మే మొదటి వారం నుంచి వివిధ ఫోన్ నంబర్ల ద్వారా పట్టాభిరామారావుతో బెయిల్ కోసం సంప్రదింపులు జరిపిన ప్రభాకరావు మే ఆరో తేదీన ఎర్రగడ్డ ప్రాంతంలో పట్టాభితో సమావేశమయ్యాడు.
గాలికి బెయిల్ మంజూరు చేస్తే పది కోట్లు ముట్టచెబుతానని ప్రభాకరరావు ప్రతిపాదించిన్లు పట్టాభి కుమారుడు రవిచంద్ర వాంగ్మూలమిచ్చాడు. ప్రభాకర్ రావు ప్రతిపాదనలకు పట్టాభి అంగీకరించకపోవడంతో ఆ తర్వాత కూడా ఫోన్లలో పలుమార్లు సంప్రదించినట్లు రవిచంద్ర వెల్లడించారు. ప్రభాకర్ రావు ప్రయత్నం విఫలమవడంతో గాలి బెయిల్ వ్యవహారంలో మాజీ న్యాయమూర్తి చలపతిరావు ప్రవేశించారు. పట్టాభి స్నేహితుడైన చలపతిరావు, రవిచంద్రలు గాలికి బెయిల్ ఇప్పించేందుకు మధ్యవర్తుల్ని కలిసే ప్రయత్నం చేశారు. మధ్యవర్తుల్ని కలిసేందుకు పట్టాభి అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఆ మర్నాడే అంటే మే 11వ తేదీన అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలికి బెయిల్ మంజూరైంది. గాలికి బెయిల్ మంజూరు చేసేందుకు 5కోట్ల రుపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పట్టాభి చెప్పినట్లు రవిచంద్ర పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. ప్రభాకర రావుతో పది కోట్ల ఒప్పందం సురక్షితం కాకపోవడంతోనే, మాజీ న్యాయమూర్తి చలపతిరావు ద్వారా ఐదు కోట్ల ఒప్పందానికి అంగీకరించారు. చలపతి రావు సూచనల మేరకు అశోక్ నగర్ కార్పొరేషన్ బ్యాంకులో ఐదు లాకర్లు ప్రారంభించడం, వాటిలో నగదు డిపాజిట్ చేయడం జరిగిందని రవిచంద్ర వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
అదే సమయంలో గాలికి బెయిల్ మంజూరైన విషయం తెలుసుకున్న ఎన్నికల సంఘంలో పనిచేసే ప్రభాకర్ రావు తమను బెదిరించడం ప్రారంభించారని వివరించారు. మే21వ తేదీన కార్పొరేషన్ బ్యాంకులో లాకర్లలో ఉంచిన డబ్బును ఖైరతాబాద్ ఐఎన్ జి వైశ్యా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు పేర్కొన్నారు. మే 23వ తేదీన సిబిఐ జడ్జి పట్టాభిని డెంటిస్ట్ వద్ద చికిత్సకు తీసుకెళ్ళిన సమయంలో ప్రభాకర్ రావు అక్కడకు వచ్చి బెదిరించారని, పట్టాభిని బెయిల్ కోసం ఎవరు సంప్రదించారో చెప్పాలని, తమకు రావాల్సిన వాటా ఇవ్వాలని, చాలా విషయాల్లో తమను మోసం చేశారని, వాటా ఇవ్వకపోతే దర్యాప్తు బృందానికి సమాచారమిస్తానని బెదిరించినట్లు రవిచంద్ర ఏసిబి వాంగ్మూలమిచ్చారు. ఇక చలపతిరావు కూడా రౌడీషీటర్ యాదగిరి ద్వారా ఐదు కోట్లు లంచం తీసుకుని పట్టాభి ద్వారా గాలికి బెయిల్ ఇచ్చినట్లు వాంగ్మూలమిచ్చారు. గాలికి బెయిల్ కోసం ప్రయత్నించిన చలపతిరావు, ప్రభాకర్ రావులు పట్టాభికి గుంటూరు ఏసి కాలేజీలో లా క్లాస్ మేట్లు కావడం విశేషం.
....avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more