బొత్స రాజకీయం ఎదుగుతున్న సమయంలో తన పై ఎలాంటి మచ్చ లేకుండా చేసుకునేందుకు మద్యం వ్యాపారానికి దూరంగా వెళ్లినట్లు తెలుస్తోంది. బొత్స తో పాటు తన బందువు వర్గానికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు మీడియా వర్గాల సమాచారం. నిన్నటి వరకు మద్యం అంటే అందరికి గుర్తు వచ్చేంది బొత్స పేరే? ఆయన ఆ బిజినెస్ లో బాగా పండిపోయారని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. మొన్నటి వరకు మద్యం కేసులతో రాష్ట్రంలో మద్యం మంటలు రగులుకున్నాయి. ప్రధానంగా బొత్స పై ఆ మద్యం మంటలు రగిలించారు. కానీ బొత్స రాజకీయ దుమారానికి కేంద్ర బిందువవుతున్న మద్యం వ్యాపారానికి దూరంగా ఉండాలని తన బంధువులకు మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మద్యం మేళాలో ఆయన బంధువులెవరూ పాల్గొనలేదని మీడియా వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి సునామీ పుట్టించింది. బొత్సపై ప్రతిపక్షాల విమర్శల దాడికి దారితీసిన విజయం తెలిసిందే. విజయనగరం జిల్లాలో బొత్స బంధువులు బినామీ పేర్లతో మద్యం దుకాణాలు నడుపుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే.
ఉప ఎన్నికల్లోనూ ఇదే అంశంపై చంద్రబాబు సహా పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శలు సంధించారు. బొత్స కుటుంబం చేతిలో సిండికేట్లు ఉన్నాయని ఆరోపణలొచ్చాయి. ఇదే సమయంలో ఏసీబీ అధికారుల వ్యవహార శైలిపైనా బొత్స ఆవేదన వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆ శాఖ జేడీ శ్రీనివాసరెడ్డి బదలీకి ఆయన ఒత్తిడే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఇవన్నీ.. రాజకీయంగా బొత్సకు ఇబ్బందికరంగానే మారి అధిష్ఠానానికీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలోనే.. తన బంధువులెవరూ మద్యం వ్యాపారం చేయకుండా కట్టడి చేస్తానని ప్రకటించారు. ఈ వ్యాపారంతో సంబంధం ఉంటే వారితో తన బంధుత్వాన్ని తెగతెంపులు చేసుకుంటానని కాస్త కటువుగానే చెప్పటం జరిగింది. దీంతో తాజా లాటరీలలో సత్తిబాబు బంధువులెవరూ పాల్గొనలేదట అంతేకాకుండా . అసలు దరఖాస్తులే వేయలేదని మీడియా వర్గాలు అంటున్నాయి. రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతున్న మద్యం వ్యాపారానికి దూరంగా ఉండటమే మేలని బొత్స నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more