జగన్ జైలుకు వెళ్లి నెల రోజులు అవుతుంది. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల అక్రమార్జనతో ..క్విడోప్రొకో తరహాలో మనీలాండరింగ్ ఆరోపణలతో హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ అయిన జగన్ ఈ నెల రోజుల పాటు రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైల్లో ఖైదీగా నాలుగు గోడల మద్య జీవితాన్ని గడుపుత్నాడు. నిన్నటితో నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా.. తన బాబాయ్ వైఎస్ వివేకనంద రెడ్డి జగన్ కు ప్రత్యేక ప్రార్థనాలు చేయటానికి జైలుకు రావటం జరిగింది. కానీ వివేకానంద రెడ్డికి జైలు అధికారులు జగన్ ముఖం చూడటానికి అవకాశం ఇవ్వలేదు .
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు ఆయన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డికి చంచల్‌గూడ జైలు అధికారులు అనుమతి నిరాకరించడంతో ఆయన జైలు ముందు బైఠాయించి ప్రార్థనాలు చెయ్యటం ప్రారంభించాడట. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 10.30 గంటలకు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు డానియల్‌తో కలిసి వివేకా చంచల్‌గూడ జైలుకు చేరకొని జగన్ కోసం ప్రార్థనలు చేయటానికి జైల్లోకి వెళ్లాటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.. అయితే జైలు అధికారులు నియమ, నిబంధనల పేరుతో ఈ ఇద్దరికి అవకాశం కల్పించకపోవడంతో వెనుదిరిగి బయటకు వచ్చినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి .
అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వివేకా తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి తిరిగి జైలుకు వచ్చినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. ములాఖత్‌కు అనుమతి లేదని జైలు అధికారులు చెప్పడంతో వివేకానందరెడ్డి జైలు ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. జగన్‌ను కలిసేంత వరకూ వెళ్లేది లేదని స్పష్టం చేయటంతో విషయం తెలుసుకున్న జైలు అధికారులు వెంటనే ఆయన్ను లోపలికి అనుమతించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రెండోసారి ప్రయత్నించిన మాజీ మంత్రి, జగన్ బాబాయి అయిన వై.ఎస్.వివేకానందరెడ్డికి ఆశాభంగమే ఎదురైంది. అయితే వివేకా నిబంధల ప్రకారమే జైలు వద్దకు వెళ్లి జగన్ ను కలవడానికి అభ్యర్ధించారా?లేక ఈయన తన ఇష్టం వచ్చినప్పుడు అక్కడకు వెళ్లి జైలు అదికారులతో గొడవ పడుతున్నారా?అన్నది చూడాలి. ఏమైన ఒక్క విషయం మాత్రం ప్రజలకు అర్థమైంది. అబ్బాయికి నెల రోజులు జైల్లో నిండినవి కాబట్టి.. బాబాయ్ ప్రార్థనాలు చెయ్యటానికి రావటంపై అనేక అనుమానాలు వస్తున్నాయాని రాజకీయ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more