ప్రతిభా పాటిల్ ఫుణేలో నివాసం కోసం ప్రభుత్వ అధికారులు వెతుకుతున్నారు. రాష్ట్రపతి పదవి విరమణ చేసే సమయం దగ్గర పడుతున్నందు వలన ప్రతిభా పాటిల్ నివాసం కోసం వేట మొదలైంది. ప్రతిభా పాటిల్ పుణేలోనే ఉండటానికి ఇష్టపడినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ప్రతిభా పాటిల్ నివాసం ఎట్టకేలకు ఖరారైంది. పుణే పషాన్‌రోడ్‌లోనున్న బంగ్లాను ప్రతిభా పాటిల్‌కు కేటాయించాలని పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పుణేలోని బంగ్లాను ప్రతిభా పాటిల్‌కు కేటాయించాలని లేఖ రాశామని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్‌కృష్ణ తెలిపారు. స్థానిక అధికారులతోనూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతోనూ ఈ విషయమై సంప్రదింపులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రాష్టప్రతి హోదాలో పదవీ విరమణ చేస్తున్న పాటిల్‌కు పూర్తిస్థాయి సౌకర్యాలు కలిగిన భవనాన్ని కేంద్ర ప్రజాపనుల విభాగం కనుగొనలేకపోయిందని, దీంతో తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ అధీనంలోకి వచ్చిన తర్వాత సంబంధిత బంగ్లాను కేంద్ర ప్రజాపనుల విభాగం పూర్తిస్థాయిలో నివాసయోగ్యంగా మారుస్తుందని ఆయన తెలిపారు. రాష్టప్రతి హోదాలో ఉన్న వ్యక్తుల్లో ఎక్కువమంది విరమణ అనంతరం సాధారణంగా న్యూఢిల్లీని ఎంచుకుంటారని, తక్కువశాతం మాత్రమే సొంత రాష్ట్రాన్ని కోరుకుంటారని కృష్ణ వివరించారు. మాజీ రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి సొంత రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లో బంగ్లాను కేటాయించాలని కోరారని, ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమకూర్చినట్లు ఆయన ఉదహరించారు. అయితే, పుణేలోని బంగ్లా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వరకూ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను తాత్కాలికంగా ప్రతిభకు కేటాయించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుణేలోని రక్షణ శాఖ అధీనంలో ఉన్న భూమిలో కొత్తగా భవనాన్ని నిర్మించాలని ప్రతిభా పాటిల్ కోరిన విషయం విదితమే. అయితే దీనిపై వివాదం నెలకొనడంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more