మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆయన జైలుకు ఎంతో హుషారుగా వచ్చిన వైయస్ వివేకా ఆ తర్వాత ముఖం చిన్నబుచ్చుకొని వెళ్లిపోయారని మీడియా వర్గాలు అంటున్నాయి. బాబాయ్ ని జైల్లో ఉన్న అబ్బాయి పలకరించకపోవడమే అసలు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.ములాఖత్ సమయంలో వైయస్ వివేకా జైలుకు హుషారుగా వచ్చారు. లోపలకు వెళ్లిన కొద్ది సేపటికే ఆయన చిన్నబుచ్చుకున్న ముఖంతో బయటకు వచ్చారట. బయట ఎవరినీ పలకరించకుండానే వెళ్లిపోయారు. బాబాయ్ వైయస్ వివేకాను చూసి జగన్ కనీసం చిరునవ్వు కూడా నవ్వలేదట. అంతేకాదు బాబాయ్‌ని చూడగానే ముఖం పక్కకు తిప్పుకున్నారని తెలుస్తోందని అంటున్నారు.
దీంతో చిన్నబోయిన వైయస్ వివేకా కాసేపు అక్కడే వేచి ఉన్నారట. అయినప్పటికీ జగన్ నుండి ఎలాంటి స్పందన లేదంటున్నారు. దీంతో చేసేది లేక ఆయన వెనుదిరిగారని అంటున్నారు. కలిసేందుకు తాను వచ్చినప్పటికీ జగన్ తన వైపు చూడకపోవడం, తనతో మాట్లాడక పోవడం వల్లనే వైయస్ వివేకా హుషారుగా వచ్చినప్పటికీ ఆ తర్వాత వేదనతో వెళ్లారని అంటున్నారు. ఇటీవలి వరకు వైయస్ వివేకా కాంగ్రెసు పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు కోసం పాటుపడ్డాడాని తాను ఆయన దారిలోనే నడుస్తానని చెప్పి అదే పార్టీలో కొనసాగారు. అయితే ఇటీవల కాంగ్రెసు నేతలు వైయస్ పైన విమర్సలు చేయడం తదితర పరిణామాల కారణంగా ఆయన కాంగ్రెసును వీడి జగన్ పంచన చేరారు. ఏమైన వైఎస్ వివేకానంద రెడ్డి టైమ్ బాగాలేదని అంటున్నారు. తన అన్న రాజశేఖర రెడ్డి చనిపోయిన దగ్గర నుండి వివేకానంద రెడ్డికి అన్ని అవమానలే జరుగుతున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వదిలి అబ్బాయి దగ్గరకు వెళ్లిన వివేకాకు బాబాయ్ ముఖం కూడా చూడకుండ ఉండటం పై అనేక అనుమానాలు వస్తున్నాయి . జగన్ బాబాయ్ ను వద్దనకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి . ఏమైన జైల్లో వివేకాకు అవమానం జరిగింది కాబట్టి సరిపోయింది . అదే ప్రజల మద్య లో జరిగితే.. వివేకా పరిస్థితి ఏమిటి? ఇక బాబాయే ఆలోచించుకోవాలి...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more