యోజన భవన్‌లో తమ కార్యాలయంలో రూ 35 లక్షల వ్యయం తో రెండు టాయ్‌లెట్లను పునరుద్ధరించడాన్ని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా సమర్థించారు. ఆ వ్యయం బడ్జెట్‌కు లోబడి చేసిందేనన్నారు. టాయ్‌లెట్లను మెరుగుపరచడంలో తప్పేమీ లేదన్నారు. ‘ఇది ప్రణాళిక సంఘం చేపట్టే రెనొవేషన్ వర్క్ కిందికి వస్తుంది. బడ్జెట్‌కు లోబడే జరిగింది. పాలనాయంత్రాంగం తీసుకున్న నిర్ణయమిది. ఇందులో తప్పేం లేదు. టాయ్‌లెట్ సదుపాయాలను పరిశుభ్రంగా ఉంచేందుకే ప్రయత్నించాం. భవనాల్ని విస్తరించినప్పుడు ఇది పనికొస్తుందను కుంటు న్నాను’ అన్నారాయన. టాయ్‌లెట్ల వినియోగంలో పరిమితులేవీ లేవని అహ్లూ వాలియా చెప్పారు. ‘పునరుద్ధరించిన టాయ్‌లెట్ల వినియోగంలో పరిమితులేం లేవు. దీనిపై నిర్ణయం తీసుకునేది సిపిడబ్ల్యూడి. ఎన్ని టాయ్‌లెట్లు కావలనేది మాత్రమే మేం చెబుతాం. ఇదది యాభైఏళ్ల నాటి భవనం. సిపిడబ్ల్యూడి పనిని నిర్వహించింది. ప్రణాళికా సంఘం కార్యాలయంలోని అన్ని టాయ్‌లెట్లను పునరుద్ధరిస్తున్నారు’ అని మాంటెక్ తెలిపారు.
యోజన భవన్‌లో రెండు టాయ్‌లెట్ల పునరుద్ధరణకు వృథాగా ఖర్చు చేశారు అన్న విమర్శల్ని తిప్పి కొడుతూ ప్రణాళికాసంఘం ఇంతకుముందు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పునరుద్ధరణ సాధారణ నిర్వహణ, మెరుగు పరచడంలో భాగమేనని పేర్కొంది. యోజన భవన్‌లో, ప్రణాళికా సంఘ కార్యాలయం ఉన్నచోట రెండు టాయ్‌లెట్ల మరమ్మతులకు రూ 35 లక్షలు వ్యయం చేశారని సమాచార హక్కు కింద అందించిన వివరాల్లో తేలింది. కారిడార్‌లో సిసిటీవీలను అమర్చడం కూడా రెనొవేషన్‌లో భాగంగా చేశారు. టాయ్‌లెట్లలోకి ప్రవేశాన్ని నియంత్రించేందుకు స్మార్ట్ కార్డ్ సిస్టంపెై దాదాపు అయిదు లక్షలు ఖర్చు చేశారు. టాయ్‌లెట్లను వినియోగించుకునేందుకు ప్రణాళికాసంఘం అధికారులకు 60 స్మార్ట్ కార్డుల్ని జారీచేసినట్టు ఆర్‌టిఐ సమాధానంలో తేలింది. టాయ్‌లెట్లలో దొంగతనాలు జరుగుతున్నాయని అధికారులు చెప్పడంతో వాటి సమీపంలోని కారిడార్లలో సిసిటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది.
పేదరిక రేఖ అంచనాల విషయంలో ఇప్పటికే విమర్శల్ని ఎదుర్కొంటున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మోంటెక్‌సింగ్ అహ్లూవాలియా తాజాగా టాయ్‌లెట్ల వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాదు. సమాచార హక్కు (ఆర్‌టిఐ) కింద ఇచ్చిన సమాధానం ఆధారంగా ఒక వార్తా పత్రిక ఇటీవల జరిపిన విదేశీ పర్యటన వ్యయాన్ని కూడా ప్రచురించింది. 2011 మే- అక్టోబర్ వరకు ఆయన విదేశీ పర్యటన ఖర్చు రోజుకు రూ 2.02 లక్షలని ఆ పత్రిక ప్రచురించింది. అయిదేళ్ల కాలంలో అంటే 2004 జూన్ నుంచి 2011 జనవరి వరకు 274 రోజుల వ్యవధిలో 42 అధికారిక పర్యటనలు జరిపారు. వాటికైన ఖర్చు రూ 2.34 కోట్లు. అధికారిక విధుల నిర్వహణకోసమే విదేశీ పర్యటనలు జరిపానని అహ్లూవాలియా సమర్థించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more