ఇప్పుడు విజయమ్మ కు పెద్ద కష్టం వచ్చిపడిందట.. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దగ్గర నుండి విజయమ్మకు విమర్శల దాడి ఎక్కువైందట. అదీ కూడా తను నమ్ముకున్న ప్రభు మీద ప్రమాణం చేయమాని కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నరట. నిజంగా జగన్ వాన్‌పిక్‌లో అవినీతికి పాల్పడలేదని విజయమ్మ బైబిల్ మీద, ఏసు క్రీస్తు మీద ప్రమాణం వేసి చెబుతారా’ అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజ గోపాల్ సవాల్ విసురుతున్నారు. జగన్ చేసిన పాపాలకు ఏసుప్రభువు కూడా క్షమించరన్న ప్రచారం ప్రారంభించారట. దానితో మిగిలిన నేతలంతా ఆయన విమర్శలను కొనసాగిస్తుండటం ప్రచారం పదునెక్కుతోందట. క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న లగడపాటి, ఆ తర్వాత ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశాల్లో ప్రధానంగా కొడుకు అవినీతి సంపాదనకు సంబంధించి బైబిల్ మీద విజయమ్మ ప్రమాణం చేస్తారా అన్న ప్రశ్న సంధిస్తున్నారు. విజయమ్మ బైబిల్ పై ప్రమాణం చేయటానికి నిరాకరిస్తుందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్ మాత్రం తన తల్లి ని బైబిల్ మీద ప్రమాణం చేయమాని విజయసాయి రెడ్డి ద్వారా చెప్పించినట్లు తెలుస్తుంది. విజయమ్మ మాత్రం బైబిల్ మీద ప్రమాణం చేయటానికి వెనకడుగు వేస్తుందని .. ఆ పార్టీ కార్యకర్తులు అంటున్నారు. వైఎస్ జగన్ మాత్రం విజయమ్మ పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడని పార్టీలో సీనియర్ నాయకులు అంటున్నారు. విజయమ్మ ప్రమాణం చేయకపోవటానికి కూడా పెద్ద కారణం ఉందని విజయమ్మ సన్నిహితులు అంటున్నారు. గతంలో.. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కదిలిస్తేనే .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి .. పంచభూతలు సాక్షిగా .. మనకు కళ్ల ముందు లేకుండా పోయాడు. ఆ దేవుడితో పెట్టుకున్నందు వలన భర్త లేకుండా పోయాడు, మళ్లీ ఇప్పుడు క్రైస్తవులకు పవిత్ర మైన .. బైబిల్ పై ప్రమాణం చేస్తే ..ఏం జరుగుతుందోనని విజయమ్మ భయపడుతుందని ఆమె సన్నిహితులతో చెబుతుందట. జగన్ మాత్రం.. ఇవన్ని పట్టించుకోకుండా.. ‘‘ నిండా మునిగినాక ..ఇంక చలి అంటే ఎలా’’ అని తల్లి కి హితబోదన చేస్తున్నాడట. అంతేకాకుండా ఇన్ని చేసిన మనం ..ఈ ఒక్కటి చేయ్యకపోతే .. ప్రజల్లో ఉన్న అనుమానం నిజం అవుతుందని, అందువలన తప్పనిసరిగా ..బైబిల్ మీద ప్రమాణం చేయాలని .. విజయసాయి రెడ్డి ద్వారా , తల్లి కి చెప్పమని చెప్పినట్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. షర్మిలా కూడా .. తల్లికి బైబిల్ మీద ప్రమాణం చేయమాని గట్టిగా చెబుతుందని మీడియా వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అయతే విజయమ్మ మాత్రం బైబిల్ మీద ప్రమాణం చేయటానికి సిద్దంగా లేనట్లు.. కన్నీళ్లతో కూడిన ముఖంతో తన కుటుంబం సభ్యులు వద్ద బాధ వ్యక్తం చేస్తున్నట్లు .. విజయమ్మ సన్నిహితులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం బైబిల్ ను ఆయుధంగా వాడుకున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. బైబిల్ అనేది క్రమశిక్షణ, నిజాయితీ, నిష్కల్మషమైన సేవ, పరులకు సేవను బోధించే పరమపవిత్రమైన గ్రంధమని, అలాంటి గ్రంధాన్ని విజయమ్మ తన కొడుకుకు సానుభూతి సంపాదించేందుకు వెంటపెట్టు కోవడాన్ని ఏసు ప్రభువు క్షమించడన్నారు. తాజా బైబిల్ నినాదంతో జగన్ కుటుంబం సంకటంలో పడినట్టయిందట. నిజంగా జగన్ నిజాయితీగా సంపాదించి, ఎవరినీ బెదిరించకుండానే పెట్టుబడులు వచ్చినట్టయితే ఆ మేరకు విజయమ్మ నిర్బయంగా బైబిల్ మీద ప్రమాణం చేయవలసి ఉంటుందట. అలా కాకుండా బైబిల్ మీద ప్రమాణం చేయవలసిన అవసరం తమకు లేదని స్పష్టం చేసినట్టయితే ప్రత్యర్ధుల విమర్శలు అంగీకరించి నట్టవుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more