నల్లధనానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన యోగా గురు రామ్ దేవ్ బాబా ఈ సారి అన్నాతో కలిసి దీక్షలో పాల్గొనబోతున్నారు. అన్నా హజారేని తీహార్ జైల్లో ఉంచినప్పుడు రామ్ దేవ్ బాబా సంఘీభావం ప్రకటించడం..రామ్ దేవ్ దీక్ష శిబిరంపై పోలీసులు చర్యని అన్నా బృందం ఖండించడం మినహా ఇద్దరూ కలిసి పనిచేసిన సందర్భాలు గతంలో లేవు. అయితే మొదటిసారిగా అన్నా హజారే రాందేవ్ భాబా ఒకే వేదికపై రావడం ఇప్పుడ ప్రజల్లోనే కాక రాజకీయ వర్గాల్లో సైతం చర్చనీయాంశమైయ్యింది.
ఇంతవరకూ వీరిద్దరూ అవినీతికివ్యతిరేకంగా వేర్వేరుగాపోరాటాలు చేశారు. గతేడాది ఏప్రిల్ లో జంతర్ మంతర్ నుంచే అన్నా హజారే లోక్ పాల్ ఉధ్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం లోక్ పాల్ బిల్లు పార్లమెంట్ అనుమతికి నోచుకోలేదు. లోక్ పాల్ బిల్లుకోసం ఢిల్లీలో రెండుసార్లు నిరాహార దీక్ష చేసిన అన్నా హజారే మూడోసారి దీక్ష వేదికను ముంబైకి మార్చారు. ఆ దీక్షకు అనుకున్నంత స్పందన రాకపోవడం అదే సమయంలో అన్నాబృందంపై వచ్చిన రకరకాల ఆరోపణలు ఆయన ఉద్యమాన్ని దెబ్బతీశాయి. అటు బాబారాందేవ్ కూడా నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడారు. గతేడాది జూన్ లో రాంలీలా మైదానంలో చేసిన దీక్ష పోలీసు చర్య కారణంగా రసాభాషగా మారింది. ఆ ఘటనలో ఓ మహిళ ప్రాణాలుకూడా కోల్పోయింది. దీంతో రాందేవ్ దీక్ష ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి.
అన్నా హజారే రాందేవ్ బాబా ఇద్దరివెనుకా ఆర్ఎస్ఎస్ భజరంగ్ దళ్ లాంటి సంస్థలున్నాయని గతంలో ఆరోపించిన కాంగ్రెస్ రానున్న పరిణామాలని కూడా నిశితంగా గమనిస్తోంది. అవినీతి నల్లధనంపై భవిష్యత్ లో పోరాటాలకి నాంది అని రాందేవ్ బాబా ఇప్పటికే ప్రకటించారు. ఈ దీక్ష అనంతంర తమ భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. మరోవైపు జూలై 24 లోపు తాము ఆరోపణలు చేసిన మంత్రులపై న్యాయవిచారణ ఆదేశించకపోతే జూలై 25 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతామని టీం అన్నా ఇప్పటికే ప్రకటించింది. కోల్ గేట్ స్కాంపై సిబిఐ ప్రాథమిక విచారణ చేపట్టిన తరుణంలో అన్నా రాందేవ్ లు ఒక్కరోజు దీక్ష అవినీతి అంశంపై మరోసారి దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.
లోక్ పాల్ ఉద్యమ సారధి అన్నా హజారే, యోగా గురువు రాందేవ్ బాబా కేంద్ర ప్రభుత్వంపై మలివిడత పోరాటానికి సిద్ధమయ్యారు. గతంలో ఎవరికి వారు విడివిడిగా అవినీతిపై ప్రభుత్వంతో పోరాడారు. అయితే తొలిసారిగా ఒకే వేదికపై అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇవాళ ఒక్కరోజు దీక్షకు దిగుతున్నారు. కోల్ గేట్ స్కాంపై సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టిన సమయంలో అన్నా, రాందేవ్ దీక్ష చర్చనీయాంశమైంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more