వైఎస్ఆర్ మరణంపై మరోసారి వివాదం రాజుకుంటోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ – వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు మీరంటే మీరంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. జగన్ అరెస్ట్ తర్వాత దిల్ కుషా గెస్ట్ హౌజ్ వద్ద విజయమ్మ.. వైఎస్ఆర్ మరణంపై అనుమానం వ్యక్తం చేయటం, తన భర్త మరణం పై దర్యాప్తు సరిగా జరగలేదని , ఆయన మరణం ప్రమాదం కాదని చెబుతున్నారు. తన ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ఆమె పదే పదే ప్రస్తావిస్తున్నారు. వైఎస్ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిగింది. హెలికాప్టర్ సరిగాలేకపోవడం వాతావరణం అనుకూలించకపోవడం వల్లనే చాపర్ ప్రమాదంలో చిక్కుకుందని సీబీఐ విచారణలో తేలింది. అది ప్రమాదంగా భావించి కేసు మూసివేశారు. ఆనాడు ఏవియేషన్ డైరెక్టర్ గా ఉన్న బ్రహ్మనంద రెడ్డి ఆ బాధ్యతల కంటే ముందు మౌలిక వసతులు శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్ ప్రమాదానికి దారితీసిన హెలికాప్టర్ నిర్వహణ సరిగాలేదని బ్రహ్మనందరెడ్డి ఆరపణలు ఎదుర్కోన్నారు. అదే బ్రహ్మా నందరెడ్డి జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగ చంచల్ గూడ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. వైఎస్ఆర్ మరణాన్ని కుట్రగా అనుమానించడాన్ని పీసీసీ చీఫ్ సత్తిబాబు ఖండిస్తున్నారట. జగన్ కు రాజ్యకాంక్ష, ధనకాంక్ష చూస్తుంటే తమ నేతను మీరేం చేశారోనన్న అనుమానం వస్తుందని సత్తిబాబు అంటున్నారు.
విజయమ్మ కూతురు ...తాను రాజన్న కూతురిని అని, జగన్ చెల్లెల్ని అని పరిచయం చేసుకున్నారు. తన తండ్రి వైయస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని మీకు చెప్పడం కోసమే మేం మీ ముందుకు వచ్చామన్నారు. ఈ అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కలిసి.. తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి మరీ కుట్ర చేస్తున్నాయన్నారు. వైయస్ మంచి మనిషి అని, ఆయన పని తీరు బాగుందని మెచ్చి రెండుసార్లు అధికారం ఇస్తే.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారన్నారు.
అలాంటి వైయస్, జగన్ పరువు తీయడానికి వీరంతా కుట్ర చేస్తున్నారన్నారు. ఆయన చరిష్మాతో నేడు గద్దెపై ఉన్న పాలకులు ఆయన కుటుంబాన్ని వీధిపాలు చేశారని, తన సోదరుడిని జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలలుగా విచారణ జరుపుతూ.. జగన్ ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేస్తారని గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రచారంలో జగన్ పాల్గొంటే ఓడిపోతామని భావించే ఆయనను జైలుకు పంపించారన్నారు.జగన్‌ను ప్రజల నుండి దూరం చేసేందుకే జైలుకు పంపించారని, ఇటువంటి నీచ రాజకీయాలు ఎక్కడైనా, ఏనాడైనా చూశామా అని ప్రశ్నించారు. నీతిమాలిన రాజకీయాలకు స్వస్తీ పలికి ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే రాజన్న రాజ్యం కావాలని కోరినట్టేనని, జగనన్న నిర్దోషిని నమ్మినట్టేనని, ఆయన సిఎం కావాలని కోరుకున్నట్టేనని అన్నారు. కాగా షర్మిళ తన ప్రసంగంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తలపించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more