2014 సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చినా తాను పోటీ చేయనని ఆయన అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి! కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారట..తన భవిష్యత్తుపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పార్టీ మారాలనుకుంటే కార్యకర్తలతో చర్చించిన అనంతరమే నిర్ణయిస్తానని చెప్పారు. కాగా చిన్నం రామకోటయ్య తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధమై పోయినట్లుగానే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చిన్నం రామకోటయ్యతో మంతనాలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి.
ఆయన త్వరలో టిడిపికి గుడ్‌బై చెప్పి త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లా జగన్ పార్టీ సామినేని ఉదయభానుతో పాటు రాష్ట్ర స్థాయి నేతలతో చిన్నం రామకోటయ్య చర్చలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసే పరిస్థితులు లేవని, జిల్లా నేతలు తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదని, చంద్రబాబు కూడా వారి మాటలనే పరిగణలోకి తీసుకుంటున్నారని ఆయన ఆవేదనతో ఉన్నారట. అందుకే ఆయన పార్టీని వీడాలనుకుంటున్నారని అంటున్నారు.
కాగా ఈ అంశంపై చిన్నం రామకోటయ్య ఓ టివి ఛానల్‌తో స్పందించారు. తాను భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేయనని మాత్రమే చెబుతున్నానని, తన నియోజకవర్గం ప్రజలకు ఏ పార్టీ ద్వారా సేవ చేయగలుగుతానని భావిస్తే తాను అదే పార్టీలో చేరతానని చెప్పారు. తనతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మాట్లాడరన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. తనతో ఏ పార్టీ నేతలు మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ, సిపిఐ ఐదు పార్టీలు ఉన్నాయని, ఏ పార్టీ ద్వారా సేవ చేయగలుగుతానని భావిస్తే అందులో చేరతానని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more