సినిమా ప్రమోషన్ల విషయంలో రకరకాల గిమ్మిక్కులు చేయడం ప్రస్తుతం పరిపాటైపోయింది. అఫ్‌కోర్స్... జనాల్లోకి సినిమాను తీసుకెళ్లడానికి ఆ మాత్రం గిమ్మిక్కులు అవసరమే అనుకోండి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ‘రచ్చ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల రామ్‌చరణ్, తమన్నాల ఇంటర్‌వ్యూని టీవీ మీడియా వారికి విడుదల చేశారు. ఎంతో సరదాగా సాగిపోయిన ఈ ఇంటర్‌వ్యూలో రామ్‌చరణ్, తమన్నా ఒకరినొకరు ఇంటర్‌వ్యూ చేసుకున్నారు. వీరి ప్రశ్నల పరంపరలో ‘రచ్చ’ విశేషాలే కాకుండా, ఇతర నటీనటుల విషయాలు కూడా తొంగి చూడటం ఆసక్తికరమైన విషయం. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో నీకు ఎవరంటే ఇష్టం? అని చరణ్‌ని తమన్నా అడిగితే- ‘‘నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. తను మంచి నటుడు, మంచి డాన్సర్ కూడా’’ అని సమాధానమిచ్చారు చరణ్. మరి నీ బెస్ట్ కో-స్టార్ ఎవరు? అని తమన్నాను చరణ్ అడిగితే- ‘‘నువ్వే... నా బెస్ట్ కో-స్టార్ ఎవరంటే నీ పేరే చెబుతా’’ అని తేల్చి చేప్పేశారు తమన్నా. ఇక ఉన్నట్టుండి వీరి డిస్కషన్ తమన్నాతో కలిసి నటించి, పెళ్లి పీటలెక్కేసిన హీరోలవైపు తిరిగింది. ‘‘కార్తీతో కలిసి ‘సిరుతై’ చేశావ్. అదే టైమ్‌లో అతని పెళ్ళైపోయింది. ఎన్టీఆర్‌తో ‘ఊసరవెల్లి’ చేశావ్. సరిగ్గా అదే టైమ్‌లో తారక్ కూడా పెళ్లిపీటలెక్కేశాడు. అలాగే బన్నీతో ‘బద్రీనాథ్’ చేశావ్. అతని పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడు నాతో ‘రచ్చ’ చేశావ్. త్వరలో నా పెళ్లి కూడా అయిపోతోంది.
దీనిని బట్టి... ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే... నీతో నటిస్తే సరిపోతుందనమాట’’ అన్నారు చరణ్ నవ్వుతూ. ఈ సందర్భంలోనే చరణ్ మరో సంగతి కూడా వివరించారు. అది - ‘‘నీకు పెళ్లవ్వాలంటే మాత్రం రానాతో కలిసి నటించు. వెంటనే అది జరిగితీరుతుంది’’ అన్నారు. ఎందుకని? అని తమన్నా ఆశ్చర్యంగా అడిగితే- ‘‘రానాతో ‘నా ఇష్టం’ చేస్తున్నప్పుడే కదా జెనీలియాకి పెళ్లయిపోయింది’’ అన్నాడు చరణ్ నవ్వుతూ. దాంతో తమన్నా షాక్ తిన్నట్లుగా నవ్వుతూ- ‘‘అవునా?!... అలాగైతే అప్పుడే అతనితో వద్దులే. నాకు పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు రానాతో చేస్తాను’’ అనేశారు. ఆ రకంగా ఈ ఇంటర్‌వ్యూ ద్వారా రామ్‌చరణ్, తమన్నా బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్నే పంచారు. ఇదిలావుంటే... రామ్‌తో కలిసి తమన్నా నటించిన ‘ఎందుకంటె ప్రేమంట’ చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే ప్రభాస్‌తో ‘రెబల్’లో నటిస్తున్నారు తమన్నా. ప్రభాస్, రామ్ ఇద్దరూ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్సే. మరి ఒంటరివారైన వీరిద్దరు కూడా తమన్నా పుణ్యమా... అని త్వరలో ఓ ‘ఇంటివారు’ అవుతారేమో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more