తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వస్థలం అయిన చంద్రగిరికి ప్రస్తుతం ఆ పార్టీకి ఇన్‌చార్జి లేరు. సినీ హీరో మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తారని అంటున్నారు. స్థానిక నేతలు అనేక మంది పోటీపడుతున్నా ఆ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గల్లా అరుణ కుమారిపై పోటీకి గట్టి అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా అన్వేషిస్తోంది.
గతంలో తెలుగుదేశం తరఫున రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన మోహన్‌బాబు తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఈ స్థితిలో లక్ష్మీ ప్రసన్న పేరు తెరపైకి వచ్చినట్లు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది. కుమారుని ప్రేమ వివాహం వల్ల వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో బంధుత్వం ఏర్పడటంతో కొంతకాలం వారికి సన్నిహితంగా వ్యవహరించారు. వైఎస్ మరణానంతరం పరిణామాల్లో జగన్‌తో సంబంధాలు దెబ్బతినడంతో వారికి దూరమయ్యారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు మళ్ళీ సన్నిహితమయ్యారు.
తిరుపతిలోని తన ఇంజనీరింగ్ కళాశాలకు కొద్ది రోజుల క్రితం చంద్రబాబును ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో మోహన్‌బాబును మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు కోరారు.
తాను మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టే యోచనలో ఉన్నానని మోహన్‌బాబు ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో ప్రకటించారు. ఆయన తెలుగుదేశంలో చేరితే లక్ష్మీప్రసన్న చంద్రగిరి అభ్యర్థి అవుతారని చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చాలాకాలం విదేశాల్లో ఉండి వచ్చిన లక్ష్మీ ప్రసన్న ఒక టీవీలో టాక్ షోను నిర్వహించి బాగా ప్రచారం పొందారు. ఈ కార్యక్రమంలో ఆమె చంద్రబాబును ఆమె ఇంటర్వ్యా చేశారు. 'చంద్రగిరిలో మా పార్టీ తరఫున ఆమె పోటీచేసే అవకాశం ఉందని వింటున్నాం. ఏదైనా కారణం వల్ల ఆమె రాజకీయాల్లోకి రాకపోతే మోహన్‌బాబు తానే అక్కడ పోటీచేసినా ఆశ్చర్యపడనక్కరలేదు' అని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించినట్లు ఆ పత్రిక రాసింది. మోహన్‌బాబుకు చెందిన శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలు చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more