మొన్న జరిగిన గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో .. దేవిశ్రీ ప్రసాద్ మెగా స్టార్ కాళ్లు పొట్టుకున్నా విషయం టాలీవుడ్ పెద్ద చర్చనీయాంశ అయింది. ఒక మ్యూజిక్ దర్శకుడు మెగా స్టార్ చిరంజీవి కాళ్లు పట్టుకోవటం ఏమిటి అని కొంత మంది దేవిశ్రీ ప్రసాద్ గుచ్చి గుచ్చి అడుగుతున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే అలాంటి వారికి దేవిశ్రీ షాక్ న్యూస్ చెప్పటంతో.. వారు కూడా .. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చిరంజీవి కాళ్ల పట్టుకుంటే .. మాకు కూడా మంచి జరుగుతుందని .. వారు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ సన్నిహితులు అంటున్నారు. అసలు దేవిశ్రీ ప్రసాద్ .. చిరు కాళ్లు ఎందుకు పట్టుకున్నాడు? దేవి చేసిన తప్పు ఏమిటి? దేవిశ్రీ చిరుకు సారీ చెప్పవలసిన పని ఏమిటి? దేవిశ్రీ ప్రసాద్ తండ్రి కూడా చిరంజీవిని ఎందుకు రిక్వెస్ట్ చేశాడు. చిరు దేవిశ్రీ ని క్షమించాడా? గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో దేవిశ్రీ ఎందుకు అంత ఆనందంగా ఉన్నాడు? అంటే దీని ఓ పెద్ద కథ ఉందని చెబుతున్నాడు దేవిశ్రీ ప్రసాద్.
టాలీవుడ్ కు కొత్త వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో.. టాలీవుడ్ ను ఉపేస్తున్న రోజులవి. అలాంటి సమయంలో దేవిశ్రీ కి మెగా స్టార్ చిరంజీవి సినిమా కు అవకాశం ఇవ్వటం జరిగిందట. మంచి జోష్ లో ఉన్న దేవిశ్రీ మెగా స్టార్ సినిమాను కేర్ లెస్ గా తీసుకొని.. కొంచెం గర్వంతో.. చిరంజీవి నటించి ‘అందరివాడు’ సినిమాకు సంగీతం సరిగా అందించలేకపోయాడు దేవిశ్రీ. సినిమా విడుదలైన తరువాత .. చాలా సినిమా బాగుంది.. కానీ.. సినిమా కు తగ్గ సంగీతం ఇవ్వలేదని .. అందువలన .. సినిమా దెబ్బతిటుందని చెప్పాటంతో.. చిరుకు బిపి పెరిగిపోయి.. దేవిశ్రీ పిలిపించి .. ఎందుకు ఇలా చేశావు అని చిరు అడగటంతో.. దేవిశ్రీ కేర్ లెస్ గా సమాధాన చెప్పి వెళ్లిపోయాడట. అప్పటి నుండి చిరంజీవి తన ఫ్యామిలీ సినిమాలకు సంగీతం దేవిశ్రీ ని తీసుకోవద్దు అని చెప్పటంతో.. మెగా హీరోలు అందరు అలాగే చేశారట.
అప్పటి నుండి నిన్నటి వరకు మెగా హీరోల నుండి ఒక్క సినిమా కూడా దేవిశ్రీకి రావటంలేదని .. టాలీవుడ్ పెద్ద టాక్ నడిసిందట. ఈ పొట్టి ప్రసాద్ మెగా ఫ్యామిలితో పెట్టుకున్నాడు . కాబట్టి అందుకే సినిమాలు రావటంలేదని అప్పట్లో గాలి వార్తలు ఫిలింనగర్ లో సందడి చేశాయి. చివరకు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి రంగంలోకి దిగి.. చిరంజీవితో సంప్రదింపులు జరిపి.. గబ్బర్ సింగ్ సినిమాకు చాన్స్ తెచ్చి కొడుకు చేతిలో పెట్టడం జరిగిందట. అప్పటి నుండి ఒళ్లు దగ్గర పెట్టుకొని . గబ్బర్ సింగ్ సినిమాకు మంచి మ్యూజిక్ చేయటమే కాకుండా ఒక పాట రాయటం కూడా జరిగిందని దేవిశ్రీ చెబుతున్నాడు.
తనకు మళ్లీ అవకాశం ఇచ్చినందుకు దేవిశ్రీ . గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ వేదిక పై మెగా స్టార్ చిరంజీవి కాళ్లు పట్టుకోవటం జరిగింది. ఆ ఆనందంలోనే చిరంజీవి గారు .. దేవిశ్రీ పైకి లేపుతూ.. మా కుంటుంబానికి దేవిశ్రీ ప్రసాద్ కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయాని చిరు చెప్పాటంతో.. దేవిశ్రీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. టాలీవుడ్ లో అందరు మళ్లీ దేవిశ్రీ ని మెగా స్టార్ దగ్గరకు తీసుకున్నాడని సినీ ప్రముఖులు ఆనందంగా ఉన్నారని ఫిలింనగర్ వాసులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more