అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాబోయే ఉపఎన్నికల సమరానికి తమ తమ వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 18స్థానాల్లో ఈ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సార్వత్రిక ఎన్నిలకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో ఆశగా ఉన్నారు. కాగా, ఎన్నికలు జరిగే స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దాదాపుగా పూర్తి చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూడ తిరుపతి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేవారు. అదే సెంటిమెంట్ ను బాబు కొనసాగిస్తున్నారు. రేపు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న తర్వాత బాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
తిరుపతి బరిలో చదలవాడ కృష్ణమూర్తిని దింపుతున్నారు. 10న రైల్వే కోడూరు, 11న రాజంపేట 12న విశాఖ జిల్లా పాయకరావుపేట, 13న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో బాబు ప్రచారం నిర్వహిస్తారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచార షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. అయితే వచ్చెనెల 18న పరకాల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. అక్కడే తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉపఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోపాటు జగన్ అవినీతి వ్యవహారాన్ని కూడ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా పార్టీ యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద దండెత్తడానికి మద్యం సిండికేట్ల వ్యవహారంలో జరిగిన అవినీతిని టిడిపి ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో మంత్రి బొత్స వ్యవహారశైలిని ఎండగట్టేందుకు విజయనగరం జిల్లాలో సభ నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగుమహిళల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి నిర్వహిస్తున్నారు. మద్యం వ్యవహారంపై ప్రత్యేక అధికారిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి బదిలీ వ్యవహారాన్ని తప్పుపడుతున్నారు. సిండికేట్లలో కీలకపాత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వల్లే, శ్రీనివాస్ రెడ్డి ని అర్థరాత్రి బదిలీ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 16 లేదా 17న విజయనగరం జిల్లాల్లో సభ నిర్వహించి మద్యం సిండికేట్లపై యుద్దాన్ని ప్రకటించనున్నట్టు టిడిపి వర్గాలు తెలిపాయి. ఎలాగైనా 2014 ఎన్నికల్లో సీఎం కుర్చీలోకూర్చోవాలని తీవ్రమైన కలలు కంటున్న చంద్రబాబుకు ఈ వ్యూహాలు ఎలా ఫలిస్తాయో చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more