దేశంలోకెల్లా పెద్ద రాష్ట్రానికి యువ ముఖ్యమంత్రి. 38 సంవత్సరాలకే రాష్ట్రముఖ్యమంత్రి అయిన ఘనత అఖిలేష్ యాదవ్ కే దక్కింది. అఖిలేష్ ఉత్తర ప్రదేశ్ లో గెలిచినందుకు.. ఆంద్రప్రదేశ్ నాయకులు చంకలు కొట్టుకున్నాడు. ఒక నాయకుడు అక్కడ సైకిల్ గెలిసింది. ఇక ఇక్కడ కూడా సైకిల్ దూసుకుపోతుందని చెప్పి.. మొన్న జరిగిన ఉప ఎన్నికలలో చతికలపడి... దీనంగా ఆకాశం వైపు చూస్తున్నాడు పాపం బాబు.
మరో నాయకుడు అవినీతికి ఆకాశం లాంటి వాడు. అవినీతిలో అందరికంటే ముందున్న వాడు. అయ్య పదవిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన వాడు. అయ్య పోయిన తరువుత కూడా .. అయ్య పేరు చెప్పి ..అందర్ని ఓదార్చుతానంటు రాష్ట్రమాంత ఓదార్పు యాత్ర చేస్తున్న జగమాయాగాడు . ఈ నాయకుడు కూడా .. అఖిలేష్ యాదవ్ ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర పర్యటన చేస్తున్నాడు. అసలు అఖిలేష్ కు జగన్ కు చాలా తేడా ఉంది. నక్కకు .. నాగలోకాని ఉన్నంత తేడ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అఖిలేష్ .. తన తండ్రి కోసం , పార్టీని ముందుకు తీసుపోతుంటే. జగన్ మాత్రం .. తండ్రి పేరు చెప్పి.. అవినీతి చేస్తున్నాడు. అంటే చెట్టు పేరు చెప్పి కాయలామ్మటం జగన్ వంతు? అయితే ఇప్పడు యూపీ ముఖ్యమంత్రి కొత్త ప్లాన్ అమలు చేస్తున్నాడట. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన అధికారులను కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ తన వాహన శ్రేణిలోని కార్ల సంఖ్యను 40 నుంచి కేవలం ఎనిమిదికి తగ్గించాలని ఉత్తర్వులను జారీ చేశారు. అంతే కాకుండా తన అధికార నివాసంలో పని చేస్తున్న ప్రత్యేక ఆసుపత్రిని మూసివేయాలని కూడా ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్ల శ్రేణిలో నుంచి 32 కార్లను తొలగించి, వాటిని రాజ్య సంపత్తి విభాగ్ (రాష్ర్ట సంపద విభాగం)కు తిరిగి పంపివేయాలని ఆయన ఆదేశించినట్లు ముఖ్యమంత్రి భద్రత విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి వాహన శ్రేణిలో ఉండే కార్లు కొన్ని అంబాసడర్లు, జామర్లు అమర్చిన ఒక ఎస్‌యువి మాత్రమే’ అని ఆయన తెలిపారు.
తన అధికార నివాసం లోపల గల అత్యున్నత స్థాయి ప్రత్యేక ఆసుపత్రిని వెంటనే మూసివేయాలని, డాక్టర్లను వారి అవసరం ఎక్కువగా ఉన్న ఆసుపత్రులకు పంపాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు అధికారులు తెలియజేశారు. మాయావతి ఆదేశాలపై ఈ ఆసుపత్రిని 2008లో ఏర్పాటు చేశారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 75 లక్షల మేరకు భారం పడుతుండేది. 38 ఏళ్ల అఖిలేష్ యాదవ్ తాజాగా తీసుకున్న చర్య వల్ల ఇతర భద్రతా నిబంధనలకు కూడా స్వస్తి చెప్పడమైంది. ముఖ్యమంత్రి వాహన శ్రేణి వెళుతున్నప్పుడు మామూలు ట్రాఫిక్‌ను నిలిపివేయడం ఇకమీదట జరగదు.
ఇప్పుడు యూపీ ముఖ్యమంత్రి పాటిస్తున్న వాటిని మన ఎపీ నాయకులు కూడా పాడిస్తే మంచిదని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా.. వైఎస్ పాటించాలని కొందరు అంటున్నారు. జగన్ ఓదార్పు పేరుతో అనేమంది వెంటబెట్టుకొని.. రాష్ట్రమంత తిరుగుతున్న జగన్ వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ వెనక వచ్చే కార్లు సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. జగన్ అటు ఇటు తిరగటం వలన ట్రాపిక్ కు అంతరాయం ఏర్పాడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా విషయం జగన్ తెలుసుకోవాలి. ముందు ఇలాంటి తెలుసుకొని ఆ తరువాత ప్రజలకు సేవా చేయాలని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more