అతను టాలీవుడ్ లో పెద్ద నిర్మాత. ఆ నిర్మాత కొన్ని వేలమంది అభిమానుల ముందు ఎన్టీఆర్ భార్యకు క్షమాపణ చెప్పాటం పెద్ద విశేషంగా టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అసలు విషయం ఏమిటయ్య అంటే . బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్, త్రిష, కార్తీక నాయకా నాయికలుగా కేయస్ రామారావు సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మించిన ‘దమ్ము’ చిత్రం ఆడియో ఆవిష్కరణ జరిగింది.
దమ్ము ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతీ కూడా తీసుకువచ్చారు. ఎన్టీఆర్ కు పెళ్లి అయిన తరువాత ఆమె ఏ ఫంక్షన్ కు తీసుకురాలేదు. ఇదే ఆమెకు మొదటి ఫంక్షన్ కావటంతో ఆమెలోని బిడియంగా ఉన్నప్పటికి.. ఆ బిడియాన్ని ఎన్టీఆర్ అభిమానులకు కనబడనీయకుండా.. చక్కని చిరునవ్వుతో.. అందరికి దర్శనమిచ్చింది. ఎన్టీఆర్ జంటను చూసిన అభిమానులు ఆనందంతో చప్పట్లు, ఈలలతో తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు.
కొత్తగా పెళ్లైన జంట, అందులోను ఎన్టీఆర్ దమ్ము ఆడియో ఫంక్షన్. ఇక అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అయితే ఆడియో వేదిక మీద నిర్మాత కేయస్ రామారావు గారు ఎన్టీఆర్ జంటను వేదికపైకి ఆహ్వనించారు. అయితే మొదట ఎన్టీఆర్ భార్య కొంచెం భయంతో అలాగే చైర్ లో ఉండటంతో.. తరువాత ఎన్టీఆర్ కనుసైగలతో.. ఆమె స్టేజీ పై కి వచ్చిందని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు.
నిర్మాత ఆ కొత్త జంట వైపు చూస్తు.. చాలా బాధపడుతూ.. అమ్మ లక్ష్మీప్రణతీ నన్ను క్షమించు అని ఆయన చెప్పటంతో.. వేదిక ఒక్కసారిగా నిశ్శబ్దంతో నిండిపోయింది. ఆయన అలా ఎందుకు చెప్పాడు అనేది అక్కుడు ఎన్టీఆర్ కూడా అర్థం కాలేదట. ఇక మిగతవారైతే.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొనే పనిలో ఉన్నారట. ఆ నిశ్శబ్దన్ని కేయస్ రామారావు గారే మళ్లీ తొలగించారట.
అసలు విషయం ఏమిటయ్య అంటే.. ఎన్టీఆర్ కు కొత్తగా పెళ్లైన విషయం తెలిసిందే. అయితే వెంటనే దమ్ము సినిమా షూటింగ్ ఉండటం వలన.. ఎన్టీఆర్ ను ఒక నెలరోజుల పాటు తన భార్య దూరం చేశాను అనే బాధ నిర్మాతలో ఉండి పోయిందట. అందుకు గాను.. ఈ రోజు ఇలా ఎన్టీఆర్ భార్యను క్షమించమని అడిగినట్లు నిర్మాత చెబుతున్నారు. ఈ విషయం విన్న అందరు ఒక్కసారిగా ఉపిరి పిల్చుకున్నారు. ఎన్టీఆర్ భార్య అయితే .. ఆమెకు ఏమీ అర్థం కాలేదని.. వేదిక మీద ప్రముఖులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more