ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలకు తెరతీశాయి. రాష్ట్ర రాజకీయ చిత్రమంతా ఏడు అసెంబ్లీ స్థానాలతో మొదలై త్వరలో మరో 1 సీట్లకు జరిగే ఉప ఎన్నికల తర్వాత మారిపోతుందనే విశ్లేషణలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య, తెలుగుదేశం పార్టీలో విశ్వసనీయతలేమితో ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో భవిష్యత్ పట్ల భయంపట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, పలుకుబడి ఉండి, ప్రజలను ఆకర్షించే స్థాయిలో మాట్లాడి, పార్టీని విజయపథంలో నడిపించే నేత ఎవరూ ప్రస్తుతం కాంగ్రెస్‌లో కనిపించడంలేదని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత విశ్వసనీయత రోజురోజుకూ దిగజారుతున్నది. దీంతో ఈ రెండు ప్రధాన పార్టీల సీనియర్ నేతలు, శాసనసభ్యుల్లో భవిష్యత్‌పై బెంగ పెరిగింది. దీంతో ప్రత్యామ్నాయాలపై చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణ విభజన తప్పదనే పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. తెలంగాణను అడ్డుకోవటానికి మాత్రమే సీమాంధ్ర నేతలు కలిసికట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప పార్టీని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలంతా ఏకమై కాంగ్రెస్ భవిష్యత్‌ను ఫణంగా పెడుతున్నారని, దీంతో పార్టీ వచ్చే ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లోనూ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసినా వాస్తవాలు హస్తినకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే మారిన పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక నివేదికను కోరినట్లు వార్తలొస్తున్నాయి. పార్లమెంట్ సెంట్రల్హాల్లో రాష్ట్ర నేతలతో జరిపిన చర్చల్లోనూ ఆమె ఈ విషయమై వాకబు చేసినట్లు సమాచారం. 2014 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బతింటే కేంద్రంలోనూ మెజారిటీ తగ్గి యూపీఏ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉండదనే అవగాహనకు సోనియా కూడా వస్తున్నట్లు చెబుతున్నారు.
దీంతో తెలంగాణపై నిర్ణయం తీసుకోకతప్పదన్న భావనకు వస్తున్నట్లు తెలుస్తున్నది. ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటలను విశ్వసించలేని పరిస్థితి నెలకొంది. ఏడు స్థానాల్లో రెండో మూడో గెలుస్తామని రాష్ట్ర నేతలు నమ్మబలికినా ఫలితాలు విరుద్ధంగా వచ్చాయి. ఇది రాష్ట్ర కాంగ్రెస్‌ను కుదిపేస్తున్నది. దీంతో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఓటమికి నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని ఇప్పటికే పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. పైగా వీరిద్దరి నాయకత్వంలో వచ్చే ఏ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించే అవకాశాల్లేవనేలా అసమ్మతి నేతలు కేంద్రానికి నివేదికలు పంపుతున్నారు.
త్వరలో జరిగే 1 స్థానాల ఉప ఎన్నికల్లో ఈ విషయం మరోసారి రుజువవుతుందనీ వారు బహిరంగంగానే చెబుతున్నారు.
దీంతో నాయకత్వ మార్పు అవసరమని ఓవైపు, తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని మరోవైపు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు టీ కాంగ్రెస్ నేతలు మరో ప్రయత్నం మొదలుపెడుతున్నారు. ఇందుకు అధిష్ఠానం అంగీకరించనట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు. తెలంగాణ ఇవ్వనట్లయితే వచ్చే ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉంటే డిపాజిట్ కోసమే పోరాటం చేయాల్సి వస్తుందని వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. 2014 సాధారణ ఎన్నికలకు ముందే ఓ నిర్ణయం తీసుకోవాలా? లేదా? అన్నది వారి ముందున్న సమస్య. 1 స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్, టీడీపీకి వ్యతిరేకంగా వస్తే వాటినుంచి పెద్దఎత్తున ఫిరాయింపులు ఉంటాయి. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుందని భావిస్తున్నారు. తద్వారా మధ్యంతర ఎన్నికలు తప్పవనే ప్రచారం అప్పుడే ప్రారంభమైంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more