ఎప్పుడు పత్రికలలో ఉండాలనే కోరిక ఉన్న వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వర్మ ఈ రోజు మీడియాలో కనిపించలేదు అనుకోవటం చాలా అరుదు. వర్మ ఎప్పుడు సంచలన విషయాలు చేస్తుంటాడు. వాటివలన కొంతమంది ఇబ్బంది కలుగుతుంది . మరి కొంతమంది ఆనందం ఉంటుంది. వర్మ సంచలన సినిమాలు తీయ్యటం ఆయన పని. బెజవాడ రౌడీలు అనే సినిమా టైటిల్ పెట్టినందుకు .. విజయవాడ ప్రజలు కారలు , మిరియాలు నూరిన విషయం తెలిసిందే. విజయవాడ ప్రజల దెబ్బ వర్మ ఆ సినిమా టైటిల్ ను బెజవాడ గా మార్చి.. సినిమా విడుదల చేయటం జరిగింది. మరళ రీసెంట్ గా.. ‘రెడ్డిగారు పోయారు’ అనే టైటిల్ తో సినిమా తీస్తున్నానని మీడియా ప్రకటన చేయటంతో.. రెడ్డి వర్గం వారు వర్మపై రెచ్చిపోయి.. వర్మ పై సినిమా తీయ్యటానికి ఆ వర్గం రెఢీ అయ్యారు. వర్మ గారు చివరకు బ్రహ్మణాలను కూడా వదిలిపెట్టలేదు పాపం. ఏకకంగా వారిపైన కేసుపెడతానని మీడియా ప్రకటన చేశాడు. భయపడిన బ్రహ్మణులు .. రెడ్డి వర్గంతో కలిసి.. వర్మ పై సినిమా ఫ్లాన్ చేశారు.
ఇప్పుడు కొత్త వర్మ మళ్లీ మరో వివాదాం చేయటానికి కంకణం కట్టకున్నట్లు తెలుస్తుంది. నవంబర్ 26/11 ముంబై మారణ హోమం గుర్తు చేస్తు సినిమా తీయ్యటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.
దీని పై ఎన్ని కొత్త వివాదాలు వస్తాయో చూడాలి మరి.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య 26/11 సంఘటనపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ రోజు నా కెరీర్లోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన సినిమా ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ షూటింగ్ మొదటి రోజు. నా కెరీర్లోనే అని ఎందుకన్నానంటే ఇంత వరకు ఎక్కడా జరుగనటువంటి అత్యంత ప్రాణాన్యత గల సంఘటన ఆధారంగా ఇది చిత్రీకరించబడుతోంది కాబట్టి. ఇంత వరకు జరిగిన ఇలాంటి సంఘటనలతో పోలిస్తే వాటి పరిమాణంలో కానీ, జరిగిన నష్టంలో కానీ, ఏర్పడిన విషాదకర పరిస్థితుల్లో కానీ ఇది సమానం కానప్పటికీ ఇందులో ఉన్న సంక్లిష్టత, సంఘర్షణలను బట్టి చూసినట్లయితే దీని ముందు 9/11 కూడా వెనుకబడుతుంది.
ఈ సంఘటనను సినిమాగా రూపొందించడానికి అత్యంత విలువైన సమాచారాన్ని నాకందించిన ఆఫీసర్స్ కు అందరికీ నేను ధన్య వాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మొత్తం పూర్తిగా కొత్త వాళ్లతో మరియు నిజంగా ఆయా పాత్రలు, ఆ సంఘటనా సమయంలో మాట్లాడిన ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మరియు మరాఠీ భాషల్లో షూట్ చేయబడుతుంది. అంతర్జాతీయంగా విడుదల చేయడమే లక్ష్యంగా గల ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 40 కోట్లు.
ఇందులో అమర్ సోలంకి నుంచి చేపలు పట్టే ‘కుబేర్’ అనే బోట్ స్వాధీనం చేసుకోవడం నుంచి, సిఎస్‌టి స్టేషన్ లో జరిగిన హత్యలు మరియు తాజ్ లో జరిగిన మారణకాండతో పాటు, కసబ్ ను హింసించే వరకూ అన్ని సన్నివేశాలు అత్యంత వివరంగా చూపబడతాయి. ఈ సినిమాలో అందరికంటే ప్రధానమైన నటుడు ఖచ్చితంగా కసబ్ పాత్రను పోషించే అతను. కసబ్ లాంటి రూపంతో పాటు, సన్నివేశాల్లో ఉన్న సంక్లిష్టత, సంఘర్షణలను అద్భతుంగా కనబరచగల నటుడి కోసం వెతుకుతూ, సంజయ్ జైస్వాల్ అనే ఒక స్టేజ్(థియేటర్)ఆర్టిస్టును ఎంపిక చేశాను’’ అని వర్మ చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more