Vidya balan adjudged best actress

Vidya Balan adjudged best actress,Vidya Balan,National Awards 2011, The Dirty Picture,Dirty Picture, Vidya Balan, National Awards

Vidya Balan has won the National Award for the Best Actress for her performance in 'The Dirty Picture

Vidya.gif

Posted: 03/08/2012 03:33 PM IST
Vidya balan adjudged best actress

Vidya Balan adjudged best actress

చెత్త చిత్రంలో ఉత్తమ నటి విద్యా ఏమిటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి .. అప్పట్లో విద్యాబాలన్ నటించిన ది డర్టీ పిక్చర్’ చిత్రం పై అనేక విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల నుండి .. బయటపడిన విద్యాబాలన్ కు ది డర్టీ పిక్చర్’ చిత్రం అనుకున్నంత చెత్త లేదని .. ఆ విమర్శకులే.. విద్యాబాలన్ ను పొగిడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి చెత్త చిత్రంలో నటించినందుకు విద్యాబాలన్ కు ఉత్తమ నటి అవార్డు వరించింది. అంతేకాకుండా .. జాతీయ అవార్డు కూడా రావటం విశేషం. సినిమా విడుదలైన దగ్గర్నుంచి అందుకు పూర్తి విరుద్ధమైన అభినందనలే అభినందనలు. ముఖ్యంగా ఆ చిత్రంలో ‘కథానాయకి’ పాత్ర పోషించిన విద్యాబాలన్‌కు దేశం నలుమూలల నుండి కితాబుల వర్షం కురిసింది. ‘ఫిలింఫేర్’ ఉత్తమనటి అవార్డు పొందడమే కాకుండా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో కూడా తనే ‘అత్యుత్తమనటి’గా విజయం కేతనం ఎగరేశారు.

‘మహిళాదినోత్సవం’ సంబరాల్లో మునిగితేలవలసిన విద్యాబాలన్‌కు ఆ కిరీటం అందటం ఆనంద డోలికల్లో ఊగినట్లుయింది.ఈ పరిణామంతో భారతీయ చిత్రపటంలో విద్యాబాలన్ పేరు మారుమోగిపోయింది. ఒక ‘శృంగారతార’ నిజజీవితంలోని పాత్రను ‘సాహసం’గా తీసుకుని... అది కూడా అప్పటివరకు ‘హోమ్లీ ఇమేజ్’ను ఏర్పరచుకున్న పరిణతి కలిగిన నటిగా ఉన్న విద్యాబాలన్ చేజిక్కిన ఈ తాజా ప్రశంసను ప్రతి స్త్రీయే కాకుండా, సినిమాలను ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా నిండు మనసుతో అభినందిస్తున్నారు.‘ది డర్టీ పిక్చర్’ చిత్రాన్ని ఒక స్త్రీ (ఏక్తాకపూర్)యే నిర్మించడం ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం కూడా.జాతీయ అవార్డు తన దరి చేరిన శుభసందర్భంలో విద్యాబాలన్ మనసులోని భావన ఈ విధంగా ఉంది.

‘‘నమ్మలేకపోతున్నా. కానీ నమ్మడానికి ప్రయత్నిస్తున్నా. నా కల నిజమైంది. ఏం చెప్పాలో తెలియడంలేదు. ఈ చిత్రాన్ని నాకిచ్చిన దర్శకుడు మిలన్ లూద్రియాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఇది. ఈ అవార్డ్ నాకెంతో ప్రత్యేకం. ఆ మాటకొస్తే.. నేను పొందే ప్రతి అవార్డ్ నాకు ప్రత్యేకమే.

Vidya Balan adjudged best actress

‘డర్టీ పిక్చర్’లో నేను చేసిన పాత్రలో శారీరకంగా ఒదిగిపోవడమే కాదు... మానసింకగా ఎంతో ఫీల్ అయ్యి చేయాల్సివచ్చింది. ఈ చిత్రవిజయం మొత్తం ‘ఫీమేల్ ఆర్టిస్ట్’లకు హెల్ప్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే, ఈ చిత్రం తర్వాత ఇలాంటి పాత్రలను రచయితలు సృష్టిస్తున్నారు. ఈ చిత్రవిజయంతో అర్థవంతమైన సినిమా, కమర్షియల్ సినిమా మధ్య ఉండే గీత చెరిగిపోయిందని భావిస్తున్నాను’’ అన్నారు విద్యాబాలన్. ‘డర్టీ పిక్చర్’లో ఆమె చేసిన పాత్రకు ‘ఉత్తమ నటి’గా జాతీయ బహుమతి గెలుచుకున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdps cycle rusted cm
Womens day special wishes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more