సునీల్, ఇషాచావ్లా జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడ క్షన్స్ పతాకంపై వీరభద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం 'పూలరంగడు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్ర వరి 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిందని దర్శకుడు వీరభద్రం అంటున్నారు. దర్శకుడిగా ఆయనకు రెండవ చిత్రం పూలరంగడు సూపర్‌హిట్ కావడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నాడు. అహనా పెళ్లంట తర్వాత వరుసగా హిట్ అయిన రెండవ చిత్రమిది. మొదటి చిత్రంకంటే రెండవ చిత్రానికి బాగా కష్టపడ్డాడని వీరభద్రం అంటున్నాడు. ఆయన పడ్డ కష్టానికి ఫలితమే 'పూలరంగడు సక్సెస్. మన మధ్యన ఉండే వ్యక్తులను పోలిన పాత్రలతో చిత్రాన్ని రూపొందించాడని అంటున్నాడు.
ఈ చిత్రాన్ని ఓ తపస్సులా చేశాడట, సినిమా షూటింగ్ ఉన్నప్పుడు టెన్షన్‌తో వీరభద్రం కు నిద్రపట్టలేదని చెబుతున్నాడు. ఇప్పుడు ఆనందంతో నిద్రపోవడం లేదని వీరభద్రం ఉత్సహంగా చెబుతున్నాడు. . ‘అహ నా పెళ్లటం’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘పూలరంగడు’. ఎంత కష్టపడైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో చేశాడట.. ఆయనతో పాటు మొత్తం యూనిట్ సభ్యులందరూ చాలా కష్టపడి చేశారని మా అందరి కష్టానికి రెట్టింపు ఫలితం వచ్చిందని దర్శకుడు మీడియా ప్రతినిధులతో చెబుతున్నాడు.
అందాల రాముడు, మర్యాద రామన్న, చిత్రాలతో హీరోగా ఓ ప్రత్యేక ఇమే జ్ను సంపాదించుకున్న సునీల్‌ను 'పూల రంగడులో కొత్త యాంగిల్లో చూపించాం.. సినిమాలోని కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. సినిమాలో సునీల్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించే క్లైమాక్స్ సన్నివేశం హైలైట్‌గా నిలి చింది. ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం సునీల్ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలుస్తుంది. సిక్స్‌ప్యాక్ బాడీ కోసం సునీల్ ప్రతిరోజు ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు జిమ్ తీవ్రంగా శ్రమించడంతో పాటు డైటింగ్ చేశాడు. ఫలితంగా వచ్చిన సిక్స్‌ప్యాక్ బాడీతో క్లైమాక్స్‌లో అద్భుతంగా నటించాడు. ఈ చిత్రా న్ని చూసిన పలువురు హీరోలు వీరభద్రంకు ఫోన్ చేసి చాలా బాగుందన్నారు. చిత్రం స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉండడంతో సినిమా హిట్ అయిం ది. సినిమాలో సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. వీటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రూపొందించాముఅని అన్నారు.
త్వరలో ఓ పెద్ద హీరోతో వీరభద్రం రూపొందించే చిత్రానికి సంబంధించిన ప్రకటన వారం రోజుల్లో వెలు వడుతుందని.. దర్శకుడు చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more