'నా పేరు నరసింహన్' అంటూ గవర్నర్ మరోసారి తన సత్తా చాటారు. సర్కారుకు షాక్ ఇచ్చారు. నిబంధనలు అంగీకరించవంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యుడి నియామకం, సెర్చి కమిటీల ఏర్పాటు ఫైళ్లను తిప్పి పంపినట్లే.... సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంపైనా 'ఎర్ర ఇంకు' పెట్టారు. ఇటీవల ఎనిమిదిని కమిషనర్లుగా ఎంపిక చేయగా... వారిలో నలుగురు ఈ పదవులకు అర్హులు కాదంటూ గవర్నర్ నరసింహన్ ఫైలును తిప్పి పంపారు. తాంతియా కుమారి, ముత్తంశెట్టి విజయ నిర్మల, వర్రె వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్‌ల నియామకం విషయంలో పునః పరిశీలన అవసరమని స్పష్టం చేశారు. దీంతో... సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ షాకిచ్చారు. సమాచార కమిషనర్లుగా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉన్న వారిని ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఆ ఫైల్‌ను సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి తిప్పి పంపారు. సమాచార చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం రాజకీయాలతో సంబంధం ఉన్న వారిని సమాచార కమిషనర్లుగా ఎంపిక చేయటం సమంజసం కాదని గవర్నర్ తన నోట్‌లో అభివూపాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పైగా ఈ రాజకీయ నియామకాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటాన్ని కూడా గవర్నర్ ప్రస్తావించినట్టు సమాచారం.
రాజకీయాలతో నేరుగా సంబంధం ఉన్నవారిలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టికెట్‌కు ప్రయత్నం చేసిన వీ వెంక ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌డ్డిపై టీడీపీ అభ్యర్థిగా రెండుసార్లు ఎన్నికల్లో తలపడ్డ ఇంతియాజ్ అహ్మద్, మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కూతురు తాంతియా, పీఆర్‌పీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలైన ఎం విజయనిర్మల ఉన్నారు. వీరిని సమాచార కమిషనర్లుగా నియమించాలన్న ప్రభుత్వ యోచనపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వీరి ఎంపిక సమయంలో అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా, సమావేశం తరువాత ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకతతో ఫైల్‌ను కొన్నాళ్లు తన వద్ద అట్టి పెట్టుకుని డిసెంట్ నోట్‌తో ప్రభుత్వానికి పంపిన విషయం తెలిసిందే.
సామాజిక కార్యకర్తలు కూడా గవర్నర్‌ను కలిసి ఈ నియామకాలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయని, వాటిని నిలువరించాలని కోరారు. వారు ముఖ్యమంవూతిని కూడా కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని ఫైల్‌ను పునఃపరిశీలన కోసం ముఖ్యమంత్రికి పంపించారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానవర్గం కూడా ఈ నియామకాలపట్ల తీవ్రంగా స్పందించి, ముఖ్యమంత్రిని వివరణ కోరినట్టు వార్తలొచ్చాయి. వారి నియామకాల్లో నిబంధనలు పాటించలేదంటూ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్ఠానం తాఖీదు ఇచ్చినట్టు విమర్శలొచ్చాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని గవర్నర్ ఈ ఫైల్‌ను ముఖ్యమంత్రికి తిప్పి పంపించారని చెబుతున్నారు.
సమాచార కమిషనర్ల నియామక ప్రతిపాదన ఫైలును గవర్నర్ తిప్పిపంపడం రాజకీయవర్గాల్లో సంచలనం కలిగించింది. దీంతో ఇకపై జరిగేదేంటన్న అంశంలో చర్చలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ సలహాను పాటించక తప్పదా? చట్టాన్ని ఉటంకిస్తూ (కోట్ చేస్తూ) సాక్షాత్తూ గవర్నర్ నరసింహన్ తిప్పి పంపిన ఫైల్‌పై సర్కార్ పునరాలోచన చేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకతప్పదా? అనే అంశాలపై నిపుణుల మధ్య చర్చ జరుగుతోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ఇతర తీవ్ర విషయాలు తప్ప గవర్నర్ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోక తప్పదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికర అంశంగా తయారైంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more