Liquor raids in andhra

Liquor raids in Andhra,Andhra Pradesh excise minister, Andhra Pradesh minister, Excise minister bribe, Liquor cartel in AP, Liquor lobby

Liquor raids in Andhra

Liquor.gif

Posted: 02/10/2012 07:00 PM IST
Liquor raids in andhra

Liquor raids in Andhra

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ను చూసి చాలా మంది మంత్రులు భయంతో వణిపోతున్నారట. ఆ శాఖ ఒక చంద్రముఖిలా పట్టి .. ఆ శాఖను నిర్వహించే మంత్రులను లకలకలాడిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గతంలో ఎక్సైజ్ శాఖను నిర్వహించి వారి తీరు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆ శాఖలో సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ మందుబాబులతో తాగించి ఆదాయాన్ని పెంచుతున్న ఎక్సైజ్ మంత్రులకు.. జనం ఉసురు తగులుతున్నట్టుంది! మంత్రులనే కాదు.. ఈ శాఖలో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారులదాకా.. అందరినీ చేసిన పాపం కట్టికుదుపుతున్నట్టే ఉంది! గడచిన 20 ఏళ్లలో ఈ శాఖ మంత్రులందరికీ ఎదురైన అనుభవాలను గమనిస్తే ఇది నిజమేనని అర్థమవుతుంది. జక్కంపూడి రామ్మోహనరావు మినహా.. రెండు దశాబ్దాలుగా ఎక్సైజ్ మంత్రులుగా పనిచేసిన వారందరిపైనా చిన్నవో.. పెద్దవో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

మర్రి చెన్నారెడ్డి హయాంలో ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేసిన కనుమూరి బాపిరాజు డిస్టిలరీలకు అనుమతులివ్వడంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీశాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత టీడీపీ హయాంలో ఈ శాఖ మంత్రి నెట్టెం రఘురామ్ ఎక్సైజ్ బదిలీల్లో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో, చంద్రబాబు ఆయన్ను తప్పించి మరొకరికి ఇచ్చారు. జీవన్‌రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి అయినా, మైదుకూరులో కల్తీసారా ఘటనతో డీఎల్ రవీంద్రారెడ్డి రాజీనామా చేశారు.

ఇక.. వైఎస్ హయాంలో జక్కంపూడి రామ్మోహన్‌రావు ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పడికీ ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైఎస్సే ఆ శాఖ వ్యవహారాలన్నీ చూసుకునే వారు. దీంతో జక్కంపూడి ఆరోపణలు రాకుండా బయటపడ్డారు. తాజాగా కిర ణ్ కేబినెట్‌లో ఎక్సైజ్‌మంత్రిగా పనిచేస్తున్న మోపిదేవి వెంకట రమణారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్సైజ్ శాఖ మంత్రులు మద్యం కాటుకు బలైపోతున్నారని.. అన్నీ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఇది తెలిని ఏ పార్టీ నాయకుడు ఎక్సైజ్ శాఖ జోలికి వెళ్లకూడదని మనస్సులో అనుకుంటున్నరని .. ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu kiran match fixing
Sunil gavaskar inducted into icc hall of fame  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more