అదేంటి టైటిల్ ని చూసి సమంతా ఒక్క రోజు రేటు 15 లక్షలా అని ఆశ్చర్య పోకండి. నిజమే ఒక్కరోజుకి సమంతా రేటు 15 లక్షలు. ఆగండాగండి .... ఒక్కరోజుకు అంత రేటు అంటే మీరు వేరేగా అర్థం చేసుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈమె రేటు దేనికి 15 లక్షలు తీసుకుంటుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
‘ఏ మాయ చేసావె’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ సమంతా. తన అందమైన నవ్వుతో అందరిని మాయ చేసి అగ్రహీరోల ప్రక్కన ఛాన్స్ లు కొట్టేస్తు అగ్ర తారగా ఎదుగుతుంది. అలాంటి సమంత దూకుడు లాంటి హిట్ చిత్రం తరువాత ఎన్నో భారీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. అయితే అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న సమంత తన రేటును అమాంతం పెంచేసింది. దాదాపు సమంతా ఒక్క సినిమాకి 80 లక్షల నుండి కోటి రూపాలయల వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం. ఇటు సినిమాల్లోనే కాకుండా అటు యాడ్స్ లో కూడా సమంత దూసుకుపోతుంది. అయితే ఈ యాడ్స్ లో సమంత రీసెంట్ గా క్రిష్ దర్సకత్వంలో ఓ కమర్షియల్ యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఓ సౌతిండియా షాపింగ్ మాల్ కోసం ఆమె రెండు రోజులు డేట్స్ ఇచ్చింది. అందునిమిత్తం అమె రోజుకు 15 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసిందని సమాచారం. అంటే రెండు రోజులకు ముప్పై లక్షలు వసూలు చేసింది. ఇది యాడ్ ఫిలిం మార్కెట్లో చాలా పెద్ద మొత్తం. అయితే ఆమె తమ బ్రాండ్ ని ప్రమోట్ చేయటం తమకు గర్వకారణమే అంటున్నారు ఆ షోరూమ్ వారు. ఈ యాడ్ ఫిలిం లో ఆమె సంప్రదాయబద్దంగా కనిపించనుంది. ఈ రెండు రోజుల షూటింగ్ హైదరాబాద్ లోనే జరిగింది. ఇక సినిమావారు మాత్రం ఈ యాడ్ విషయం విని సినిమాలకు డేట్స్ ఇవ్వమంటే సమస్య పెడుతుంది కానీ వీటిని మాత్రం వదులుకోదు అంటున్నారు.
మరి ఈమెకు ఇంత రేటు పెట్టి ఒక్కరోజు ఎవరైనా మాట్లాడుకుంటారా అంటే... ఈమెకు ఒక్కరోజు డేట్స్ ఇవ్వడానికే ఖాళీగా లేదట. అంత బిజీగా ఉందట సమంతా. ఎందుకంటే ఈ హాట్ స్టార్ తెలుగులో కంటిన్యూగా సినిమాలకు వరసగా డేట్స్ ఇచ్చి వాటిని ఎడ్జెస్ట్ చెయ్యలేక ఇబ్బందిపడుతూ ఆమధ్య బెల్లంకొండ సురేష్ తో గొడవ పడి ఫిల్మ్ ఛాంబర్ దాకా తెచ్చుకుంది. అయితే ఇప్పుడు సెటిల్ మెంట్ చేసుకుని వరస సినిమాలు గ్యాప్ లేకుండా కమిటైంది. ఇక సమంత వరసగా సిద్దార్ధ సరసన బెల్లంకొండ సురేష్ చిత్రం,రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రం,మహేష్ సరనస దిల్ రాజు చిత్రం,నాని సరసన ఈగ,గౌతమ్ మీనన్ చిత్రాలు చేస్తోంది. ఏమైనా సమంతా అందరిని మాయ చేసి డబ్బులు వసూలు చేస్తుందన్న మాట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more