తెలుగు సినిమాల్లో మసాల అనేది మాటలని దాటి, పాటలకి పాకి చాలాకాలం అయింది. అయితే అప్పట్లో ఈ టైపు పాటలు వ్యాంపుల వేదికపై నుంచి వచ్చేవి. రాన్రాను మరింత మసాలాను ఒంటికి పట్టించుకున్న ఈ పాటలు ఇప్పుడు హీరోయిన్ల అందచందాలపై నుంచి జాలువారుతున్నాయి. అసలు కథలో ఓ నాయిక ఉంటే... మరో హీరోయిన్ తో ఇలాంటి పాటలు పెట్టి, వాటికి ఐటంసాంగ్స్ అని పేరుపెట్టి కూడా చాలా కాలమైంది. దాంతో ఈ టైపు సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి ఆదరణ కూడా పెరిగింది. ఫలితంగా ఇలాంటి పాటల్లో కవ్విస్తూ కనువిందు చేసే అందగత్తెలకి డిమాండ్ ఎక్కువైపోయింది. బ్యానర్ ఏంటీ...హీరో-హీరోయిన్ ఎవరు...అనేది పట్టిచుకోకుండా ఐటంసాంగ్ ఎవరు చేస్తున్నారు అనే దాని పైనే ఆడియన్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దాంతో ఐటంసాంగ్స్ కోసం హీరోయిన్స్ మధ్య గట్టి పోటి ఉంటోంది.
ఓ వైపున కరీనా ...మరో వైపున కత్రీనా ఐటంసాంగ్స్ తో హల్ చల్ చేస్తుంటే ఇప్పుడు విద్యాబాలన్ కూడా ఆ బాటనే పట్టింది. 'ఫెరారీ కి సవారి' అనే చిత్రం లో ఆమె ఓ ఐటంసాంగ్ చేస్తోంది. రాజేష్ మస్సూకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే ఈ ఐటంలో సాహిత్య పరంగా, చిత్రీకరణ పరంగా, వేషధారణ పరంగా మసాలా అనేదే ఉండదని అంటున్నారు. ఇవేవి లేకపోతే అది ఐటంసాంగ్ ఎలా అవుతుందనే గుసగుసలు అప్పుడే మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యాబాలన్ అభిమానులు మాత్రం 'మేమంతా కలిసి నీకిచ్చిన ఇమేజ్ ఏంటి... నువ్వు చేస్తున్న డాన్స్ లేంటి' అంటూ అలుగుతున్నారట
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more