బాబు ఎప్పడు ఎందుకు ఎడుస్తాడో .. ఆ బాబు కన్నతల్లికి తెలుస్తుంది? అయితే చంద్రబాబు మాత్రం ఎప్పడు ఎలా మారుతాడో? ఎవరితో ఎలా మాట్లాడతాడో? ఎక్కడ ఏ రంగు పూసుకుంటాడో ఎవరి తెలియదట. అసలు చంద్రబాబు భార్యకే తెలియదట. ఎందుకంటే ఆయన తీరు లాంటింది. తెలంగాణ విషయంలో ఇప్పటికి బాబు వైఖరి చెప్పాకుండా ఉన్నడని అందరికి తెలిసిన విషయమే.
కానీ ఇటీవల కాలంలో చంద్రబాబు మీద నందమూరి కుటుంబం చాలా కోపంగా ఉందని తెలిసిందే. అయితే ఆ కోపం తాపాలు ఎప్పటి వరకు ఉంటాయో మాత్రం ఎవరు చెప్పాలేరట. ఎందుకంటే నారా వారు, నందమూరి వారు .. కోపం వస్తే .. కళ్ళు ఎర్రబడేలా చూసుకుంటారట. అదే కోపం తగ్గింతే మాత్రం ఇరు కుటుంబల వారు తమ కౌగిలిలో కత్తుల పెట్టుకొని కౌగిలించుకుంటారట? అంటే ‘ద్రుతరాష్ట్రుని కౌగిలి’లాంటిదన్నమాట.. ఇప్పడు అలాంటి సమయం బాబుకు వచ్చిందట.
గతంలో చంద్రబాబు .. ఎన్నికల కోసం .. నందమూరి కుటుంబాన్ని ఎన్నికల ప్రచారం చేయించాడు. వాళ్లు ప్రచారం చేసిన బాబు మాత్రం ఓటమిని చూడక తప్పలేదని బాబు చాలా బాదపడ్డాడట. కానీ కదులున్న కాలంతో పాటు బాబు .. నందమూరి కుటుంబల మధ్య దూరం పెరిగిందట. అంటే ఒకరి తెలియకుండా మరొకరు సొంత రాజకీయలు చేయటం మొదలు పెట్టారట. ఒకనొక సమయంలో బాబు మీద నందమూరి కుటుంబం, తెలుగు దేశం నాయకులు కలిసి గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఆ గొడవ సుడిగాలిలా వచ్చి వెళ్లిపోయిందని బాబు అంటున్నారు. ఆ గొడవ పోయిన .. దాని ప్రభావం మాత్రం నారా , నందమూరి కుటుంబలలో పెరుగుతునే ఉందట. ఆ గొడవ అప్పడప్పుడు బయటకు వస్తుందట. దానికి విరుగుడుగా బాబు బాలయ్యను రంగంలోకి దించాడట.
బాలయ్య రాకతో తెలుగు దేశం పార్టీలో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకున్నాయని.. పార్టీ కార్యకర్తలు అంటున్నారు. పార్టీని తన చేతిలోకి తీసుకోవాలని బాలయ్య చూస్తున్నడట. ఇటీవల విశాఖ టూర్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు .. రాష్ట్ర రాజకీయాలను వేడిపుట్టించినట్లైంది. బాలయ్య రగిలించిన వేడి .. చివరకు నందమూరి కుటుంబ సభ్యులను సైతం ఆలోచింప చేసిందట. బాలయ్యతో బాబుకు కొత్త తలనొప్పులు వచ్చే విధంగా ఉన్నాయని బాబు ముందుగానే గ్రహించి దానికి విరుగుడు కనిపెట్టే పనిలో బాబు ఉన్నాడని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.
తెలుగు దేశం పార్టీ నాయకులు అనుకున్నట్లే బాబు బాలయ్య వ్యాఖ్యలకు సరికొత్త విరుగుడు కనిపెట్టాడట. నందమూరి కుటుంబం కంటే పార్టీ ముఖ్యమని . పార్టీ అన్నది ప్రజలకు సంబంధించినదని, పార్టీకి కొన్ని విధానాలుంటాయాని, అందువలన సమష్టి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని, పార్టీ అధ్యక్షుడిగా బాబు కూడా కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయట. . అలాగే బాబుది ఎన్టీఆర్ కుటుంబం చాలా పెద్ద కుటుంబంమాట . కాబట్టి కుటుంబ సమస్యలు కూడా అలాగే ఉంటాయాని బాబు పార్టీ వర్గాలతో అంటున్నారట.. అటు పార్టీని, ఇటు కుటుంబాన్ని కూడా కలుపుకెళ్ళే ప్రయత్నాలు బాబు చేస్తారట. తెలుగుదేశం పార్టీకి , నందమూరి కుటుంబానికి సమస్యలొస్తే, హరికృష్ణ కావచ్చు.. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు.. మరొకరు కావచ్చు... ఎవరినీ దూరం చేసుకునే పరిస్థితి ఉండదని బాబు చెబుతున్నాడట. తెలుగు దేశం పార్టీని కాపాడుకోవడం కూడా ముఖ్యమైన విషయమే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు.
చంద్రబాబు తెలుగు దేశం పార్టీ కోసం ఎవరినీ వదులుకోరట. పార్టీకి అందరూ కావాలని, అంటే జూనియర్ ఎన్టీఆర్ ను , హరికృష్ణ అసలు వదులుకోనే పనేలేదని, వారి సపోర్టు మాకు ఎప్పుడు కావాలని, బాబు మీడియా ముందు అంటున్నారట. పార్టీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే సరిదిద్దుకుంటమాని బాబు స్వయంగా . స్పష్టంగా చెప్పాడట, అటు కుటుంబ సభ్యుల వల్ల అయినా, ఇటు నాయకుల వల్ల అయినా పార్టీ బలోపేతం కావడమే ముఖ్య లక్ష్యమని బాబు అంటున్నారట.
ఏదీ ఏమైన బాబు మరల జూనియర్ ఎన్టీఆర్ కు , గాలం వేస్తున్నాడని పార్టీలో సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. బాబు ఎందుకు ఇంత తొందరగా బయట పడ్డాడు అంటే.. అందుకు ఒక కారణం ఉందట. ఎన్టీఆర్ కు పెళ్లి అయిన దగ్గర నుండి .. బాబుతో, తెలుగు దేశం పార్టీతో సంబంధాలు చాలా వరకు తగ్గించిన విషయం తెలిసిందే.
కానీ ఎవ్వరికి తెలియాని విషయం బాబు తెలిసిందట. 2014 ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ , ఆయన మామ నార్నే శ్రీనివాసరావులు కలిసి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉందని జూనియర్ సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు. అప్పటి వరకు ఎన్టీఆర్ మామ టీవీ మీద పట్టు సంపాదించుకొని .. మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నడట. అంతేకాకుండా.. ఈ మధ్య కాలంలో స్టూడియో ఎన్ లో .. కొత్త ప్రోగ్రమ్ ఒకటి పెట్టాడట. ఎన్టీఆర్ తన మామ టీవిలో ‘‘ తెలుగమ్మాయి 2012’’ కొత్త కానెస్పెట్ పెట్టి .. రాష్ట్రంలో ఉన్న అన్నీ జిల్లాలు తిరుగుతూ.. ఎన్టీఆర్ .. మెల్ల మెల్లగా తన బలం పెంచుకుంటున్నాడని .. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. అందువలనే బాలయ్యను రంగంలోకి దించాడని మాటలు కూడా పార్టీ ఆఫీసులో వినిపిస్తున్నాయి. .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more