Ex isro chief g madhavan nair slams govt after devas axe

Ex-ISRO chief G Madhavan Nair slams govt after Devas axe,Indian Space Research Organisation, 'Madhavan Nair takes on government,

Ex-ISRO chief G Madhavan Nair slams govt after Devas axe,The government's decision to bar top space scientist G Madhavan Nair and three other former ISRO scientists from any official

ISRO1.gif

Posted: 01/26/2012 04:00 PM IST
Ex isro chief g madhavan nair slams govt after devas axe

Ex-ISRO chief G Madhavan Nair slams govt after Devas axe

‘ఇస్రో ప్రతిష్ట వీధిపాలైంది. కుక్కలు చింపిన విస్తరి అయింది. ఎలాపోతే నాకేం?’ అని మాధవన్‌ నాయర్‌ అంటున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా విషయాల సంస్థ ‘ఇస్రో’ మాజీ ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌, ఆ సంస్థకు చెందిన మరో ముగ్గురు మాజీ అధికారులపైన ప్రభుత్వం నిషేధం విధించింది. ఇస్రో ప్రతిష్ట దెబ్బ తినకూడదనే రెండేళ్లపాటు ఆంట్రిక్స్‌-దేవాస్‌ ఒప్పందం గురించి తనేమీ మాట్లాడలేదని మాధవన్‌ నాయర్‌ అంటున్నారు.. మాజీ ఛైర్మన్‌ జి మాధవన్‌ నాయర్‌ తమ సంస్థపైన, ప్రస్తుత ఛైర్మన్‌ పైనా చేసిన తీవ్ర విమర్శలపై వ్యాఖ్యానించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిరాకరించింది.

తన హయాంలో కుదిరిన దేవాస్‌ కాంట్రాక్ట్‌లో అక్రమాలు జరిగాయంటూ తనపైన, మాజీ సహోద్యోగులు మరో ముగ్గురు అధికారులపైన ఆరోపించడమే కాకుండా, అధికారిక హోదాలు పొందకుండా బ్లాక్‌ లిస్ట్‌లో వేటువేయడంపై ఆయన మండిపడ్డారు. ‘ప్రభుత్వ హోదా లభించకుండా నాపై వేటు వేసిన సంగతిని నేను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొస్తూ విజ్ఞాపనపత్రాన్ని పంపించాను. ఎలాంటి దర్యాప్తు చేయకుండా, నా వాదనను వినిపించే అవకాశం ఇవ్వకుండా నాపై నిషేధం విధించారని ఆయనకు విన్నవించాను. రాధాకృష్ణన్‌ తన వ్యాఖ్యలతో నా ఒక్కడిమీదే మరకపడలేదు. మొత్తం ఇస్రో వ్యవస్థ అంతా కళంకితమన్న భావన కలిగించారు. రాష్టప్రతిని, ప్రధానమంత్రిని నేను ఇప్పటికీ గౌరవిస్తాను. వారు ఈ విషయంలో జోక్యం చేసుకుంటారనుకుంటున్నాను’ అని నాయర్‌ అంటున్నారు.

ఇస్రో ప్రతిష్టకు భంగం వాటిల్ల కూడదనే తను రెండేళ్లుగా ఆంట్రిక్స్‌ -దేవాస్‌ ఒప్పందం గురించి మాట్లాడలేదని నాయర్‌ అన్నారు. ‘సంస్థ గౌరవం ముఖ్యం. అందుకే నోరు మెదపలేదు. కానీ, నాపై విధించిన నిషేధం పూర్తిగా అన్యాయం. ఏ సంస్థలో కానీ, ప్రభుత్వంలో అధికారిక కమిటీల్లో కానీ పనిచేయడం కానీ ఇష్టం లేదు. నియంతృత్వంలోను, సైనిక ప్రభుత్వంలోను కూడా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినవారికి తమ వాదన వినిపించేందుకు అవకాశం ఉంటుంది. కానీ నాకా అవకాశమే లేకుండా చేశారు. నాపై వేటుకు సంబంధించిన ఉత్తర్వు అందకున్నా, అది తెలిసి షాకయ్యాను’ అని నాయర్‌ చెప్పారు. ‘ఆ ఉత్తర్వు నాకింకా అందలేదు. అందిన తర్వాత, నేను తీసుకోవాల్సిన చర్య గురించి నిర్ణయించుకుంటాను’ అని ఇస్రో మాజీ ఛైర్మన్‌ నాయర్‌ చెనై్నలో అన్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చీఫ్ జి.మాధవన్ నాయర్‌తోపాటు మరో ముగ్గరు శాస్త్రవేత్తలపై కేంద్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇస్రో వాణిజ్య విభాగమైన ‘యాంట్రిక్స్ కార్పొరేషన్’, దేవాస్ మల్టిమీడియా లిమిటెడ్ అనే కంపెనీతో కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందంలో వారి ప్రమేయంపై ఈ చర్యలు తీసుకుంది. నాయర్ సహా ఇస్రో మాజీ సైంటిఫిక్ సెక్రటరీ కె.భాస్కరనారాయణ, యాంట్రిక్స్ మాజీ మేనేజింగ్ డెరైక్టర్ కె.ఆర్. శ్రీధరమూర్తి, ఇస్రో అంతరిక్ష కేంద్రం మాజీ డెరైక్టర్ కె.ఎన్.శంకరలు భవిష్యత్తులో తిరిగి ప్రభుత్వ పదవులు చేపట్టకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ నిషేధం విధించింది.

అలాగే ప్రభుత్వంతో వారి ప్రస్తుత బాధ్యత లేదా అసైన్‌మెంట్ తక్షణమే రద్దవుతుందని ఈ నెల 13న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత అరుదైన ఎస్ బ్యాండ్‌లో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను దేవాస్‌కు ఇస్రో కట్టబెట్టాలనుకోవడం వివాదాస్పదమైంది. దేవాస్ తన డిజిటల్ మల్టిమీడియా సేవలు ప్రారంభించేందుకు ప్రతిపాదిత జీశాట్-6, జీశాట్-6ఏ ఉపగ్రహాల్లో 90 శాతం ట్రాన్స్‌పాండర్లను యాంట్రిక్స్ లీజుకిచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇందుకు ప్రతిగా దేవాస్ 12 ఏళ్ల వ్యవధిలో మొత్తం 30 కోట్ల డాలర్లు (సుమారు రూ. 1,500 కోట్లు) చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఇస్రో చీఫ్‌గా నాయర్ పనిచేసిన సమయంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మన్మోహన్‌సింగ్ యాంట్రిక్స్-దేవాస్‌ల మధ్య కుదిరిన ఒప్పందంలోని వివిధ అంశాలను

రిశీలించాలంటూ 2011 మే 31న ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికతోపాటు దాన్ని పరిశీలించిన మరో కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. భారత్ తొలిసారి విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-1 ప్రాజెక్టు రూపకర్తల్లో నాయర్ కూడా ఒకరు. 2003 నుంచి 2009 వరకూ నాయర్ ఇస్రో చైర్మన్‌గా వ్యవహరించారు. అంతరిక్ష పరిశోధనలో అందించిన సేవలకుగాను ప్రభుత్వం ఆయనను 1998లో పద్మభూషణ్, 2009లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఐఐటీ-పాట్నా గవర్నర్ల బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నాయర్ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.

యూపీఏకి కొత్త తలనొప్పి

ఇప్పటికే వివిధ కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వానికి మాధవన్ నాయర్‌పై వేటు వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉంది. దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నాయర్‌పై చర్యల వల్ల ఇస్రో నిట్టనిలువునా చీలే ప్రమాదముందని ప్రభుత్వ పెద్దల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు యాంట్రిక్స్-దేవాస్ ఒప్పందం వివాదం చివరికి పీఎంఓ మెడకు చుట్టుకుంటుందేమోననే సందేహాలు తలెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mass raja ravi teja is celebrating his birthday
Ys jagan yoga practicing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more