రాజకీయల్లో ఎవరు ఎవరికి మద్దతు నిలబడతారే చెప్పాలేం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సమయంలో ఇప్పటి వరకు మనం చూసి వాటిల్లో .. కొడుకు కోసం అమ్మ, తండ్రి కోసం కొడుకు, భర్య కోసం భార్య, భార్య కోసం భర్త, బావ కోసం బావమరుదులు, మామ కోసం అల్లుడు, ఇలా చెప్పుకుంటే పోతే .. అనేక అనుబందాలతో ఎన్నికలు జరిగినాయి. ఇప్పడు కొత్త ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు కొత్త బంధం తోడైంది. అక్కడ తమ్ముడు కోసం అక్క రంగంలోకి దిగిందట. అంటే రాహల్ గాంధీ కోసం ప్రియాంక వాద్రా ప్రచారంలోకి వచ్చిందట.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి కాం గ్రెస్ పార్టీ తరఫున ‘స్టార్ కాంపెయినర్లు’ రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ప్రచారాన్ని ఉధృతం చేశారు. వారిద్దరూ రాయ్‌బరేలి, అమేథి లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తీవ్రంగా ప్రచారం చేస్తున్నా రు. ప్రచారంలో భాగంగా వారు పలువురు స్థానిక నాయకులతో సమావేశా లు నిర్వహిస్తూ పరిస్థితిని మదింపు చేస్తున్నారు. ఎన్నికల తేదీలు దగ్గరపడు తుండడంతో పార్టీకి పరీక్షగా మారిన ఈ సమయంలో రాహుల్, ప్రియాంక తమ ప్రచార వేగాన్ని పెంచాలని భావించారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడ ఎ లాంటి ప్రచార వ్యూహాన్ని అవలంబించాలన్న దానిపై కూలంకషంగా సమాలోచలు చేస్తున్నారు. ఫిబ్రవరి 8న తొలి విడత పోలింగ్ ప్రారంభమై మార్చి 8వ తేదీతో యూపీలో ఏడు విడతల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి.మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రియాంకా వాద్రా రాయ్‌బరేలీ లోక్‌సభా నియోజకవర్గంలోని ఛత్రపతి షాహూజీ మహరాజ్ నగర్‌లోని ఫుర్సాత్‌గంజ్‌కు చేరుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అంతర్గత విభేదాల్ని విడనాడా లని ప్రియాంక వాద్రా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పార్టీలో ముఠాలు కట్టడాన్ని (గ్రూపిజం) ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబో మని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రియాం క వాద్రా కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న అమేథీ, రాయ్‌బరేలీలలో పర్యటిస్తున్నా రు. ఆమె మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది. గ్రూపి జంపై నిఘా ఉంచేందుకు గ్రామస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తామని, రహస్య సంకేతంతో వాటిని గుర్తిస్తామని ప్రియాంక తెలిపారు. టిలోయ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పార్టీ కార్యకర్తలతో ఆమె మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పార్టీ విజయానికి, మిషన్ 2012 విజయా నికి కలిసి పనిచేయాలని ఆమె కార్యకర్తల్ని కోరారు. ‘సమయం తక్కువగా ఉంది. కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలవద్దకు వెళ్లాలి. కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ఓటర్లకు తెలిపి, పార్టీ అభ్యర్థులకు వారి మద్దతు సాధించాలి’ అని ప్రియాంక చెప్పినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారికి సంపూర్ణ గౌరవం ఉం టుందని, అయితే వారు ముఠాలు కట్టకుండా, రాహుల్ గాంధీకి అండగా నిలబడాలని ఆమె కోరారు. తన తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, సోదరుడు రాహుల్‌గాంధీ నియోజ వర్గం అమేథీలలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని తాను నిర్వహిస్తానని కూడా ప్రియాంక తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి ఆమె అమేథీ పర్యటన ప్రారంభ మవుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంతో తీరిక లేకుండా ఉన్నందున ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ప్రియాంక ఖరారు చేస్తారు.
రెండో విడత ప్రచారం కోసం ప్రియాంక ఫిబ్రవరి 2న మరోసారి అమేథికి వస్తారు. ఒ పక్కన కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి ఓటర్లకు వివరించేం దుకు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ అంతటా సుడిగాలి పర్యటనలు చేస్తారని, ప్రియాంక ప్రస్తుత పర్యటనలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకువచ్చేం దుకు కృషిచేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరికొద్ది రోజుల తరువాత ప్రియాంక బహిరంగ ఎన్నికల సభలు కూడా ప్రారంభమవుతాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలో రాహుల్ గాం ధీ ప్రచారమంతా గిరిజన ఓటర్లు అధికంగా ఉన్న బుందేల్‌ఖండ్ మీదే కేంద్రీ కరిస్తారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ కృషి కారణంగానే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేంగా అభివృద్ధి ప్యాకేజిని ప్రకటించింది. రాహుల్ గాంధీ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని లలిత్‌పూర్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. అక్కడ జరిగే ఎన్నికల బహిరంగ సభలో గిరిజనులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more