నిన్న హైదరాబాద్ లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి వర్గంలోకి ప్రజాస్వామ్య ధోరణి విస్తరించటం స్వాగతించదగ్గ విషయం. ఇంతవరకూ ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో ముందగానే నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత ఇతరుల చేత సమ్మతింప జేయటం ఆనవాయితీగా వస్తోంది. అలా నియంతగా పని చెయ్యటానికి వీల్లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ హయాంలో ధ్వజమెత్తటానికి అవకాశమిచ్చారాయన. దానికి తోడు కేంద్రమంత్రి సారధ్యంలో రాష్ట్ర సమన్వయ కమిటీని స్థాపించటంతో, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహతో సహా పలువురు మంత్రులు ముఖ్యమంత్రి నియంతలా పనిచెయ్యటాన్ని తప్పుపట్టారు. ఏ పథకాలను ప్రకటించినా వాటిని ముందుగా సమన్వయ కమిటీ లో పెట్టాలని, వాటి నిర్వహణను కూడా సమన్వయ కమిటీ పరిశీలిస్తుందని చర్చలు, ఆరోపణల సారం.
లోగడ చంద్రబాబు నాయుడు కానీ, వైయస్ రాజశేఖరరెడ్డి కానీ ఉన్న సమయంలో ఇంత తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు తెలిపేవారు కాదు. దాని వలన వారు వారి ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కొందరు, ఆ హోదాను తమ వ్యక్తిగత పటిమతో కలిపి ఎదురులేకుండా వ్యవహరించారు.
దాని ఫలితమే వైయస్ జగన్, చంద్రబాబు ఆస్తుల మీద ఆరోపణల విషయంలో ప్రతిబింబిస్తోంది. ఆరోపణల దృష్ట్యా అన్నన్ని కుంభకోణాలు, అంతంత స్థాయిలో జరిగితే తోటి మంత్రులకు ఏమీ తెలియకపోవటం, అధిష్టానం వరకూ ఏమీ వెళ్ళకపోవటం ఆశ్చర్యమనిపిస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రంటే నియంత కాదని, సాటి మంత్రులు, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలే కాదు వారి అభిప్రాయాలకు కూడా గౌరవమివ్వవలసివుంటుందని స్పష్టంగా తీవ్రస్థాయిలో తెలియజేసినందుకు అభినందనలు. ఇదే పంథాలో ప్రతిపక్షాలతో కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఇంకా బావుంటుంది. ఎందుకంటే సంఖ్యాబలం చాలక ప్రతిపక్షంలో ఉన్నా, వారు కూడా ఏదో ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే.
అయితే ఇవన్నీ ఆశాసౌధాలే. వాస్తవంలో పాలక పక్షం ఏం చేసినా ప్రతిపక్షం విమర్శిస్తుంది, ఏం చెయ్యకపోయినా విమర్శిస్తుంది. అలాగే ప్రతిపక్షాలంటే వైరులుగా పాలకవర్గం భావిస్తుంది. వారు వారు చేసే పనులు ప్రజాహితంలో ప్రజల కోసమని కాకుండా వారి వారి పార్టీల ప్రతిష్ట పెంచుకునే దిశగా పనిచేస్తుండటం దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
సమన్వయ కమటీ వాదులాడుకోవటానికేనా అని కొందరు రాజకీయ నేతలు విమర్శించారు. కానీ సమన్వయం కుదరాలంటే ముందుగా తమ తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించాల్సిందే. నిన్న అదే జరిగింది. ఆరోపణలు చెయ్యటం కూడా తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చటమే అవుతుంది. అవన్నీ తీరిపోతేనే కదా సమన్వయం కుదిరేది
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more