అనంతపురం, రాయదుర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలపై విప్ ధిక్కరణ నేప థ్యంలో అనర్హత వేటు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు సీబీఐ ఛార్జిషీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ వీరు రాజీనామాలు కూడా చేశారు. గురనాథరెడ్డి, కాపు లిద్దరూ విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన విషయం తెలి సిందే. వీరిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు ఖాయం. ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖచ్చితంగా ఉంటుంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లాగా అనంతపురానికి పేరు.
ఈక్రమంలో ఉప ఎన్నికల ఫలితాలను అంత సులభంగా ఊహించ డానికి వీలుండదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు జరిగితే అనంతపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడం దాదాపు ఖాయం. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు రషీద్ అహ్మద్, మాజీ మేయర్ రాగే పరశురాం, మాజీ కార్పొరేటర్ వజ్జల మల్లి కార్జున, ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డిలు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ వి. ప్రభాకర్ చౌదరి, గతంలో పోటీ చేసి ఓడి పోయిన మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ రాజ్యసభ సభ్యుడు సైఫుల్లా కుటుం బీకులు, నదీం అహ్మద్ టికెట్‌ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రథమ స్థానంలో నిలవగా,టీడీపీ అభ్యర్థి రెండు, ప్రజారాజ్యంపార్టీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. ఆఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ గణనీయంగా 25 వేల ఓట్లకు పైబడి సాధించింది. గురునాథరెడ్డి కుటుంబీకులు నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఉంది. దీంతో ఆయ న తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియోజ కవర్గంలో బలిజలు, ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం, గత ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసు కుంటే ఫలానా వారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పడం కష్టం.
ఇటీవలేే మాజీ మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్‌చౌదరి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన తనదైన శైలిలో కార్యక్రమాలను నిర్వహి స్తున్నారు. సొంత వర్గంపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధా రపడాల్సిన పరిస్థితి ఉంది. ఇక రాయదుర్గం నియోజకవర్గం విషయానికొస్తే..గాలి జనార్దన్‌రెడ్డి స్నేహితుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అపకీర్తి మూటగట్టు కున్నారన్న ఆరోపణలు లే పోదు. నియోజకవర్గంలో ఆయన పెద్దగా పర్యటించలేదని, సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని సమాచారం. అయినప్పటికీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థిగా ఆయనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నియోజకవర్గంలో బోయ సామాజికవర్గం ఎక్కు వుగా ఉంది. కాపు తరపున బళ్ళారి గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీరాము లు ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. శ్రీరాములు బోయ సామాజిక వర్గానికి చెందిన వారే.కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పాటిల్ వేణు గోపాలరెడ్డి, మాజీ మునిసిపల్ చైైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పాటిల్ తిరుగులేని నాయకుడుగా ఉన్నారు. గౌనికి టికెట్ రావాలన్నా పాటిల్ చెప్పాల్సిందే.
ఆరోగ్యం సహకరిస్తే పాటిల్ పోటీలో ఉండడం దాదాపు ఖాయం. పాటిల్‌కు విస్తృత పరిచయాలు, మంచిపేరు ఉంది. తెలుగుదేశం గాలి వీచిన 1983లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ తరపున కాంగ్రెస్ నేత జె.సి.ప్రభాకర్‌రెడ్డి అల్లుడు, పారిశ్రామిక వేత్త దీపక్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. దీపక్‌కు టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని పార్టీ అధిష్టానానికి మెట్టు చెప్పినట్లు సమా చారం. ఈ నియోజకవర్గంలో టీడీపీకి నమ్మకమైన ఓటింగ్ ఉంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో గెలుపెవరిదన్నది ఊహించడం కష్టమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more