Another Hindu-Muslim Story From Superhit Director? నాని, శర్వాలతో హను రాఘవపూడీ మల్టీస్టారర్.!

Hanu raghavapudi s multi starrer with nani and sharwanand

Hanu Raghavpudi multi-starer, Nani Sharwanand with Hanu Raghavapudi, Hanu Raghavapudi Periodic drama, Natural star Nani, Young Hero Sharwanand, Multi-starer Love Story, sitaramam, Hanu Raghavapudi, Tollywood, movies, Entertainment

Hanu Raghavapudi is back with Sita Ramam. Along with winning accolades, the film made huge money at the box-office. Hanu Raghavapudi earned enough respect at this crucial time in his career. Tollywood is discussing about the upcoming film of this talented director. He is committed to Mythri Movie Makers for his next film and the script work is happening currently. The film too is a periodic drama and it is a multi-starrer.

మరో మల్టీసార్టర్ లవ్ స్టోరీకి హను రాఘవపూడీ రెడీ.!

Posted: 09/13/2022 04:39 PM IST
Hanu raghavapudi s multi starrer with nani and sharwanand

ప్రేమకథలను వెండితెరపై ప్రెజంట్ చేయడంలో టాలీవుడ్ దర్శకులు ఒకరితో మరోకరు పోటీపడి మరీ రూపోందించగలరు. అయితే అందరిలోనూ కథను, కథాంశాన్ని విభిన్నంగా ప్రోజక్ట్ చేయడంలో అగ్రబాగన నిలిచే కొందరిలో హను రాఘవపూడి ఒకరన్న విషయం తెలిసిందే. తనదైన ప్రత్యేకమైన స్టయిల్ లో చక్కని చిత్రాలను రూపొందిస్తారని హను రాఘవ పూడికి పేరుంది. ఆయన దర్శకత్వంలో రూపొందించి.. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమై.. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను పోందిన ‘సీతరామం’ చిత్రం కూడా నిరూపించింది.

లేటెస్ట్ చిత్రం విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మరో ప్రేమకథకు ఆయన స్వీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ చిత్రం సాధారణ ప్రేమకథా చిత్రంగా కాకుండా మల్టీ స్టారర్ చిత్రానికి పూనుకుంటున్నాడు. ఈ మేరకు ఇప్పటికే తన అలోచనలు బయటపెట్టాడని, ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టకు దిశగా అడుగులు వేస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలో తన నెక్ట్స్ ప్రాజక్టు నేపథ్యంలో ఇద్దరు స్నేహితుల క్యారెక్టర్లకు గానూ హీరోలను కూడా ఎంపిక చేసుకున్నాడని సమాచారం.

ఇద్దరు హీరోలుగా న్యాచురల్ స్టార్ నానిని ఒక పాత్రకు ఎంపిక చేసుకోగా, మరో హీరో పాత్ర కోసం యంగ్ హీరో శర్వానంద్ లను ఎంపిక చేసుకున్నాడని కూడా తెలుస్తోంది. ఇందులో ఒకరు హిందూ యువకుడిగా నటించనుండగా, మరోకరు ముస్లిం యువకుడిగా నటించనున్నారు. ఈ ఇద్దరు హీరోలతో దర్శకుడు హను రాఘవపూడికి మంచి సాన్నిహిత్యం ఉంది. నానితో ఆయన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రాన్ని రూపోందించగా, శర్వాతో ‘పడి పడి లేచే మనసు’ అనే చిత్రాలను రూపోందించారు. ఈ ఇద్దరితో మల్టీ స్టారర్ చేయడానికి ఒక బడా నిర్మాణ సంస్థ ముందుకు వచ్చిందనే వార్తలు కూడా చిత్రపురిలో షికార్లు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sexey anti pooja bedijr ntr
Oscar award winner katherin  

Other Articles