టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు అదిరిపోయే అప్డేట్ ను అందించారు చిత్రబృందం. ఈ చిత్రం నుంచి గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ వీడియోను లాంఛ్ చేశారు. గాడ్ ఫాదర్‌గా చిరు సాల్ట్ పెప్పర్ లుక్‌లో బ్లాక్ కుర్తా పైజామాలో బ్లాక్ అంబాసిడర్ కారులో వచ్చి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ మూవీ లవర్స్ కు అదిరిపోయే ట్రీట్ అందిస్తున్నాయి.
కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న మూవీ గాడ్‌ఫాదర్. మెగా ఫ్యాన్స్‌లో ఎంతగానో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లుక్ అభిమానుల అంచనాలకు మించివుంది. చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. కాలు మీద కాలు వేసుకొని చెయిర్లో దర్జాగా కూర్చొన్న చిరంజీవిని ఈ పోస్టర్లో చూడొచ్చు. గాడ్ ఫాదర్లో చిరు క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. వేలాది మంది కార్యకర్తలు వేచి చూస్తుండగా పార్టీ ఆఫీస్‌కు వచ్చిన చిరు కారులో నుంచి కిందికి దిగడం, తనదైన స్టైల్లో నడుస్తూ వెళ్లడం గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
బ్లాక్ కుర్తా వేసుకున్న చిరుకు ఫుల్ వైట్ అండ్ వైట్‌లో ఉన్న సునీల్ కారు డోరు తీయడం చూడొచ్చు. ఈ గెటప్‌లో చిరును చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు. చిరు పక్కన ఫిమేల్ లీడ్ రోల్లో నయనతార కనిపించనుంది. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more