Viswak Sen condition to his Producers ‘ఆ’ విషయంలో తగ్గేదేలే అంటున్న విశ్వక్ సేన్

Young hero viswak sen condition to his producers

Vishwak Sen, remuneration, Ashokavanamla arjuna kalyanam, HIT, controversy, prank videos, movie promotions, Tollywood, Movie News, Entertainment

Actors least bother about remuneration if the movies they star in flop, But on the another hand if the films they star are hit, they raise their renumaration which is shocking to the producers. Among them, young heroes are demanding remuneration in the range where only senior heroes compete. Vishwak Sen recently joined the list.

‘ఆ’ విషయంలో తగ్గేదేలే అంటున్న విశ్వక్ సేన్

Posted: 05/21/2022 05:47 PM IST
Young hero viswak sen condition to his producers

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం  ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. విద్యాసాగర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై  విడుదలకు ముందే మంచి హైప్‌ క్రియేట్‌ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన  ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాసింత కాంట్రవర్సీకి తెరలేపిన విశ్వక్ సేన్.. చిత్రం విడుదలై హిట్ టాక్ సోంతం చేసుకోవడంతో ఆ సక్సెస్ ముందు ఇవన్నీ కోట్టుకుపోయాయి.

అయితే ఈ చిత్రం హిట్ కావడంతో తాను గతంలో పలువురు ప్రముఖనటులు నడిచిన బాటలోనే పయనిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం విశ్కక్‌ ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అదేంటీ అనుకోకండీ.. 'అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాకు ముందు వరకు తాను తీసుకున్న రెన్యూమరేషన్ ను ఇప్పుడు ఏకంగా పెంచేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయన ఓక్కో చిత్రానికి రూ. 1.5-2కోట్ల వరకు పారితోషికం తీసుకునేవాడు.

ఇక ఇప్పుడు ఆ రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేశాడట. కొత్త ప్రాజెక్ట్స్‌ కోసం విశ్వక్‌ దగ్గరికి వెళ్తే తన రెమ్యునరేషన్‌ పెంచిన విషయాన్ని చె్ప్పి షాక్ ఇస్తున్నాడట. ఇంతకీ ఎంత చేశాడనేగా.. ఇప్పుడు విశ్వక్ సేన్ ఒక్కో చిత్రానికి రూ.3కోట్లు తీసుకుంటున్నాడట అడిగినంత ఇస్తేనే సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. అంతేగా మరీ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెప్పారుగా మరీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles