Boney Kapoor calls South films wholesome ‘thali’ దక్షిణాధి సినిమాలపై బోనికపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Boney kapoor says bollywood is like mcdonalds where you get only what you order

boney kapoor, boney kapoor south films, boney kapoor bollywood films, boney kapoor south films and bollywood, boney kapoor south indian films, South Indian Cinema, Bollywood, wholesome Thali, Mc Donald, Valimai, Ajith Kumar, South films, Tollywood, Movies, Entertainment

Filmmaker and producer Boney Kapoor is currently basking in the success of his Tamil film Valimai that has already entered the ₹200 crore club. The Ajith Kumar starrer was released on February 24, 2022. Boney has talked about the differences in the Bollywood and South Indian film industry.

దక్షిణాధి సినిమాలపై బోనికపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted: 03/07/2022 06:40 PM IST
Boney kapoor says bollywood is like mcdonalds where you get only what you order

బాలీవుడ్ చిత్రాలపై ప్రముఖ సినీనిర్మాత బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్ల క్రితం వరకు భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్ర‌స్ గా బాలీవుడ్ చిత్రాలే నిలిచాయని అయితే ప్రస్తుతం మాత్రం ఆ అభిప్రాయాలు పోయాయని అన్నరు. ఇప్పడు భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ చిత్రాలను తలదన్నే చిత్రాలు వస్తున్నాయని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ సినిమాల ప్రాముఖ్య‌త‌ రోజురోజుకీ త‌గ్గిపోతుంది. ద‌క్షిణాది సినిమాలతో పోల్చి చూస్తే అంత ఆస‌క్తిక‌రమైన కంటెంట్ రావ‌డం లేదని అన్నారు.

దక్షిణాది చిత్రాలను నిర్మించడంతో పాటు హిట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న ఈ బాలీవుడ్ బ‌డా ప్రొడ్యూస‌ర్ సౌతిండియన్ సినిమాపై త‌న‌దైన స్టైల్‌లో ప్ర‌శంస‌లు కురిపించారు. కొంత మంది ముంబై సినిమాల విష‌యంలో మాత్రం మీరు ఆర్డర్ చేసినవి మాత్రమే మీకు వ‌స్తాయి. అయితే సౌత్ సినిమాల విష‌యానికొస్తే మీకు రోటీ, దాల్-చావల్, చికెన్‌తో థాలీని అందిస్తాయి. చాలా వ‌రకు ద‌క్షిణాది సినిమాలు భారతీయ ప్రేక్షకుల కోసం తీసినవేన‌ని బోనీక‌పూర్ అన్నారు. మ‌ల‌యాళం సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంను శాసిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

థియేట‌ర్లు విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనూ తెలుగు సినిమా వాటికి బూస్ట్‌ను అందిస్తుందన్నారు. ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించేలా చేస్తోందన్నారు. ఇక త‌మిళ సినిమాలు డ‌బ్బింగ్ వెర్ష‌న్ల‌తో నార్తిండియా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ కూడా పాన్ ఇండియా సినిమాల‌తో త‌న ప‌వ‌ర్ ఏంటో చూసిస్తోందని చెప్పుకొచ్చారు బోనీక‌పూర్‌. బాలీవుడ్‌తో పోలిస్తే ఇపుడు ద‌క్షిణాది సినిమాలే నిజ‌మైన భార‌తీయ సినిమా అని అర్థ‌మ‌వుతోంది. రాబోయే రోజుల్లో దక్షిణాది చిత్రాలే దేశానికి తలమానికంగా నిలుస్తాయన్న అభిప్రాయానికి బోనికపూర్ వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles