Prakash Raj To Remake 'Dear Father' In South Indian Languages గుజరాతీ సినిమా తెలుగు హక్కులు కొన్న ప్రకాశ్ రాజ్.!

Prakash raj to remake paresh rawal s dear father in south indian languages

Paresh Rawal Dear Father, Paresh Rawal Gujarati films, Prakash Raj dear father, Prakash raj dear father south indian rights, dear father south indian rights, prakash raj Jai Bhim, Prakash raj south indian actor, Tollywood, Gujarati cinema

Actor Prakash Raj, who is known for his work in Telugu, Malayalam, Kannada and Tamil cinema, besides being well known in Bollywood, has bought the official remake rights of actor Paresh Rawal's upcoming Gujarati film 'Dear Father'. 'Dear Father' is the cinematic adaptation of Rawal's play by the same name and revolves around the life of three family members. The story is high of emotional content, which is said to be its USP.

గుజరాతీ సినిమా తెలుగు హక్కులు కొన్న ప్రకాశ్ రాజ్.!

Posted: 03/04/2022 07:29 PM IST
Prakash raj to remake paresh rawal s dear father in south indian languages

తెలుగు చిత్రసీమలో ఇప్పుడు రీమేకుల జోరు నడుస్తోంది. తమిళ.. మలయాళ సినిమాలను ఇక్కడ వరుసగా రీమేకులు చేస్తూ వెళుతున్నారు. ఇప్పటికే హిట్ అయిన చిత్రాలను తెలుగులో రిమేక్ చేసిన ప్రేక్షకాధరణ పోందేందుకు పోటీ పడుతున్నాయి. ఇక అక్కడి సినిమాలు ఇక్కడి ప్రేక్షకులకు కూడా అలరించడం విశేషం. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ ద్విపాత్రాభినయంలో నటించిన గుజరాతీ సినిమా రిమేక్ హక్కులను ప్రకాశ్ రాజ్ సోంతం చేసుకున్నారు.

ఈ విషయాన్ని గుజరాతీ ‘డియర్ ఫాధర్’ చిత్ర నిర్మాత రతన్ జైన్ దృవీకరించారు. విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ అటు నిర్మాణ రంగంలోనూ రాణిస్తున్నారు. మంచి కథాంశం ఉన్న చిత్రాలను ఎంచుకుని వాటిని ఆయన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాతీ సినిమా రీమేక్ హక్కులను ప్రకాశ్ సొంతం చేసుకున్నారు. ఉమాంగ్ వ్యాస్ దర్శకత్వం వహించిన గుజరాతీ సినిమా 'డియర్ ఫాదర్' ఈ రోజునే భారీ స్థాయిలో విడుదలైంది. పరేష్ రావెల్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది.

40 ఏళ్ల తరువాత ఆయన చేసిన గుజరాతీ సినిమా కావడంతో అక్కడ అందరిలో ఆసక్తినెలకొంది. వయసుమళ్లిన ఒక వ్యక్తి .. అతని కొడుకు.. కోడలు చుట్టూ తిరిగే కథాంశంతో రూపోందిన ఈ చిత్రం ఆయనకు బాగా నచ్చింది. కథానాయకుడికి యాక్సిడెంట్ కావడంతో పోలీస్ విచారణ మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ కూడా కథానాయకుడి మాదిరిగానే ఉండటంతో కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఈ కథ గురించి తెలియగానే ప్రకాశ్ రాజ్ పోటీపడి ఈ సినిమా దక్షిణాది రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. నిజంగానే ఈ పాత్రకి ప్రకాశ్ రాజ్ బాగా సెట్ అవుతాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles