Big B Thanks 'Bahubali' Prabhas For Home Food ఇంటి బోజనంతో బిగ్ బి మనసు గెలిచిన బాహుబలి

Prabhas wins over amitabh bachchan with his home cooked food

prabhas, baahubali, actor prabhas, homemade food, project k, project k shooting, amitabh bacchan, amitabh bacchan instagram, amitabh bachan tweet, project k sci-fi thriller, project k prabhas amitabh bachchan, project k prabhas deepika padukone, Nag Ashwin, project k, sci-fi thriller, bollywod news, Bollywood, movies, Entertainment

Amitabh Bachchan is shooting for his upcoming project with Bahubali' famed superstar Prabhas. The sci-fi thriller, tentatively titled 'Project K', also features Deepika Padukone in the lead. Amitabh Bachchan took to his Twitter handle to thank actor Prabhas for sending home-cooked food to him. Mr. Bachchan mentioned that he is impressed by the latter's generosity.

ఇంటి బోజనంతో బిగ్ బి మనసు గెలిచిన బాహుబలి

Posted: 02/21/2022 08:20 PM IST
Prabhas wins over amitabh bachchan with his home cooked food

పాన్ ఇండియా హీరో. రెబల్ స్టార్ ప్రభాస్​ బాహుబలి సిరీస్ చిత్రాలతో సాహో చిత్రంలో తన రేంజ్ ను అమాంతం పెంచుకున్నాడు. ఇకపై ఆయనను టాలీవుడ్ స్టార్​గా పేర్కోనలేని స్థాయిని అందుకున్నాడు. తన సినిమాలతో అభిమానులకు విందు భోజనం వడ్డించేందుక కూడా సిద్దమయ్యాడు. ఒకే వరుసలో ఏకంగా మూడు చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రాధేశ్యామ్, అదిపురుష్, సలార్, సినిమాలతో పాటు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోనూ నటిస్తున్నారు. కాగా తన చిత్రాల షూటింగ్​లో పాల్గొనే కోస్టార్స్.. అందులోనూ సీనియర్ నటులతో ఆయన ఎలా వ్యవహరిస్తారన్న అసక్తి సర్వత్రా నెలకొంటుంది.

ఈ క్రమంలోనే ఇదివరకే పలు సందర్బాలలో ఆయన తొటి నటులపై ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటారని ఇప్పటికే తెలిసిన విషయమే. తాను బోజనం చేయడంతో పాటు సహచర నటులకు, ఇతర సిబ్బందికి కూడా ఆయన బోజనం పెట్టడంతో పాటు ప్రేమగా వడ్డిస్తాడన్న విషయం ఇప్పటికే పలువురు వెల్లడించారు. ప్రభాస్​ ఎక్కడా సినిమా చేసినా తన వంటమనిషితో వండించుకుని తినడం అలవాటు. తనే కాకుండా కోస్టార్స్​కు కూడా ఇంటి రుచులను రుచిచూపిస్తాడు. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్​కు విందు భోజనం వడ్డించాడు. ఇప్పుడు మరో బిగ్​ స్టార్​కు ప్రభాస్​ ఆతిథ్యం అందించాడు.  

ప్రస్తుతం ప్రభాస్​ 'మహానటి' డైరెక్టర్​ నాగ్​ అశ్విన్​ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్​ కె' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రీకరణలో ఇటీవల బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్ పాల్గొన్నారు. తనతో కలిసి పనిచేస్తున్న బిగ్ బీకి ప్రభాస్​ తన ఇంటి విందు భోజనాన్ని రుచి చూపించాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్​ వేదికగా అమితాబ్​ బచ్చన్​ తెలిపారు. 'టీ4198-బాహుబలి ప్రభాస్​. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్​ మాత్రం జీర్ణించుకోలేను.' అని ట్వీట్​ చేశారు అమితాబ్​.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  amitabh bacchan  Deepika Padukone  Nag Ashwin  project k  sci-fi thriller  homemade food  bollywod  

Other Articles