టాలీవుడ్ యాక్షన్ హీరో, మాచో స్టార్ గోపీచంద్ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ‘పక్కా కమర్షియల్’ విడుదల తేదీని లాక్ చేసుకుంది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో పలు చిత్రాలు షూటింగ్ లతో పాటు విడుదలను కూడా వాయిదా వేసుకున్నాయి. కరోనా మహమ్మారి తన ఉద్దృతిని తగ్గించుకున్న క్రమంలో ధియేటర్లలో ఫుల్ సీటింగ్ కెపాసిటీకి ప్రభుత్వాలు అనుమతిని ఇవ్వడంతో.. ఇక వరుస పెట్టి చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ 1న విడుదల కావాల్సిన గోపిచంద్ ‘పక్కా కమర్షియల్’ చిత్రం కూడా ఈ ఏడాదికి వాయిదా పడింది. చక్కటి యాక్షన్, కామెడీ, డ్రామా నేపథ్యంలో మారుతి రూపోందిస్తున్న ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయనున్నారు.
తాజాగా మేకర్స్ పక్కా కమర్షియల్ టైటిల్ ట్రాక్ ను విడుదల చేశారు. జీవన్మరణ ఇతివృత్తంతో నవలా ఆధారంగా పక్కా కమర్షియల్ సాంగ్ రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. పూజలు, పురస్కారాలు, నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియలే. ఆ దేవుడు..జీవుడు.. భక్తులు..అగరత్తులు అన్నీ పక్కా కమర్షియలే..ఆ గురువులు..శిష్యులు..చదువులు..చట్టబండలు అన్నీ పక్కా కమర్షియలే అంటూ జాక్స్ బెజోయ్ మ్యూజిక్ కంపోజిషన్‌లో వచ్చిన ఈ పాట పెప్పీ వైబ్స్ తో ఫ్రెష్ ఫీల్‌ను కలిగిస్తోంది. ఈ చిత్రంలో సత్యరాజ్, రావురమేశ్, అనసూయ భరద్వాజ్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more