Chiranjeevi’s Acharya confirmed its release date వేసవి సెలవుల్లో పాఠాలు చెప్పనున్న మెగాస్టార్ ‘ఆచార్య’

Megastar chiranjeevi s acharya confirmed its release date in summer

Acharya, Chiranjeevi, ram charan, koratala siva, Kajal agarwal, Manisharma, Niranjan Reddy, Konidela productions, matniee entertainments, Tollywood, Movies, Entertainment

The makers of Acharya unveiled the release date of the movie featuring Megastar Chiranjeevi and Mega power star Ram Charan. The Koratala siva directional movie is all set to release in summer vacation ie on April 28th. The movie release had been postponed due to coronavirus.

వేసవి సెలవుల్లో పాఠాలు చెప్పనున్న మెగాస్టార్ ‘ఆచార్య’

Posted: 01/31/2022 08:28 PM IST
Megastar chiranjeevi s acharya confirmed its release date in summer

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలసి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. అన్ని సినిమాల మాదిరిగానే ఈ చిత్రంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది. అనేక బ్రేకులు మధ్య కొనసాగిన ఈ సినిమా షూటింగ్ మొత్తానికి గుమ్మడి కాయ కొట్టేసి.. పోస్టు ప్రోడక్షన్స్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా వుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించినా.. కరొనా మూడవ దశ నేపథ్యంలో వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే పలు చిత్రాలు పూర్తై విడుదలకు సిద్దంగా వున్న నేపథ్యంలో చిరంజీవి తన చిత్రాన్ని ఫిబ్రవరి 4కు బదులు ఏప్రిల్ 29కి వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా స్పష్టతను ఇచ్చింది.

ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. మణిశర్మ బీట్‌లకు చిరంజీవి డాన్స్ మూవ్ మెంట్స్ కలిస్తే ధియేటర్లలో అభిమానుల చేత ఈలలు వేయించడం.. కెవ్వుకేకలు పెట్టించడం పరిపాటిగా మారిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘లాహే లాహే’, ‘నీలాంబరి’ పాటలు విశేషంగా అలరించాయి. ఇప్పుడా జాబితాలోకి మరో హుషారైన గీతం చేరింది. ఈ సినిమాలోని ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను సినీయూనిట్ ఇవాళ విడుదల చేసింది. మణిశర్మ సంగీతం, చిరంజీవి స్టెప్పులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ చిత్రంలోని ప్రత్యేక పాటలో చిరుకి జోడీగా రెజీనా సందడి చేసింది. భాస్కరభట్ల రవికుమార్‌ రచించిన ఈ పాటను రేవంత్‌, గీతామాధురి ఆలపించారు. దేవాదాయ శాఖ నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్‌.. సిద్ధ అనే కీలక పాత్ర పోషించారు. చిరుకు జోడీగా కాజల్‌, చరణ్‌కు జంటగా పూజాహెగ్డే  నటించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదలకానుంది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles