Sree Vishnu's Bhala Thandanana teaser is out అంచనాలు పెంచుతున్న శ్రీవిష్ణు ‘భళాతందనాన’ టీజర్

Naturalstar nani unveils sree vishnu s bhala thandanana teaser

Sree Vishnu, Catherine Tresa, Garuda Ram, Posani Krishna Murali, Satya Akkala, Ayyappa P. Sharma, Srinivasa Reddy, Mani Sharma, Chaitanya Dantuluri, Rajani Korrapati, tollywood, movies, entertainment

Actor Nani took to his social media handles to release the teaser of Sree Vishnu's upcoming political thriller titled 'Bhala Thandanana'. The 'Bhala Thandanana' teaser features Sree Vishnu in a boy-next-door avatar, while he showcases his other side of a revolutionary young man who goes against a corrupt political leader.

నాని చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘భళాతందనాన’ సినిమా టీజర్

Posted: 01/28/2022 06:59 PM IST
Naturalstar nani unveils sree vishnu s bhala thandanana teaser

‘రాక్షసుడిని చంపేందుకు దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి.. నేను మామూలు మనిషిని’.. ఆకట్టుకునే డైలాగ్ తో ప్రారంభమైన ‘భళా తందనాన’ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో చూపించిన ప్రతి డైలాగ్ ఇంటెన్స్ గానే ఉంది. ఈ టీజర్ ను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. ఇందులో శ్రీవిష్ణు హీరోగా చేస్తున్నాడు. కేథరీన్ ట్రెసా శశిరేఖగా కనిపించనుంది. ‘నిజాయతీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే’, ‘లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు’ అంటూ సాగే డైలాగ్ లు ప్రతి ఒక్కరినీ, సొసైటీని తాకేలా ఉన్నాయి.

టీజర్ చివర్లో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ ఇక సూపర్ అనే చెప్పాలి. ‘‘సీఎం కుర్చీలో కూర్చున్న ఎవ్వరైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ నే మార్చేయొచ్చు. అంటే.. ఆ పవర్ చేతిదా? కుర్చీదా?’’ అనే ఆ డైలాగ్ హైలైట్. ఇక, ఆచార్య తర్వాత మణిశర్మ సంగీతం అందిస్తున్న సినిమా ఇది. ఈ టీజర్ లో ఆయన ఇచ్చిన బీజీఎం ఓ లెవెల్ లో ఉంది. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles