Nanis' Shyam Singha Roy Trailer: Engrossing ఆకట్టుకుంటున్న నాని 'శ్యామ్ సింగ రాయ్' ట్రైలర్

Shyam singha roy trailer with nani sai pallavi krithi shetty is intriguing

Shyam Singha Roy, Nani, Sai Pallavi, Madonna Sebastian, Kriti Shetty, Hyderabad set, Kolkata, Rahul Sankrityan, Shyam Singha Roy, nani Shyam Singha Roy movie news, Shyam Singha Roy movie updates,Nani, Shyam Singha Roy, Tollywood, Movies, Entertainment

The trailer of Nani and Sai Pallavi-starrer Shyam Singha Roy was released. The highly-anticipated movie stars Nani in a dual role and has Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian as the female leads. The movie is directed by Rahul Sankrityan and produced by Venkat Boyanapalli under Niharika Entertainments.

ఆకట్టుకుంటున్న నాని 'శ్యామ్ సింగ రాయ్' ట్రైలర్

Posted: 12/15/2021 09:38 PM IST
Shyam singha roy trailer with nani sai pallavi krithi shetty is intriguing

న్యాచురల్ స్టార్ హీరో నాని కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక నేపథ్యమున్న చిత్రం 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ నెల 24న థియేటరల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది.పాన్ ఇండియా ప్రాజెక్టు శ్యామ్ సింగ‌రాయ్. రాహుల్ సంకీర్త్య‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఐ యామ్ వాసు..ఫిలిం డైరెక్ట‌ర్ అంటూ నాని త‌న‌ను ప‌రిచ‌యం చేసుకునే సీన్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. వాసు జ‌ర్నీలో కృతిశెట్టితో ల‌వ్ ట్రాక్ క‌నిపిస్తోంది.

ఆ త‌ర్వాత త‌న పోలిక‌ల‌తో ఉన్న‌ శ్యామ్ సింగరాయ్ క‌థ‌ గురించి తెలుసుకుంటాడు వాసు. శ్యామ్ సింగ‌రాయ్ దేవ‌దాసి అయిన సాయిప‌ల్ల‌వి ప్రేమ‌లో ప‌డ‌తాడని తెలుస్తోంది. మరోవైపు స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌పై శ్యామ్ సింగ‌రాయ్ ఎలాంటి పోరాటం చేశాడ‌నేది సినిమాలో చూపించ‌బోతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ల‌వ్, యాక్ష‌న్, రొమాంటిక్ సీన్ల క‌ల‌బోత‌గా సాగుతున్న ట్రైల‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. వాసు, శ్యామ్ సింగ రాయ్ లా డిఫ‌రెంట్ షేడ్స్ లో న‌టించిన నాని తాజా చిత్రం ఏ స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles