RRR’s Janani Song: The Soul Anthem Gets Terrific Response ‘ఆర్ఆర్ఆర్’ జననీ పాట: భావోద్వేగంతో కట్టిపడేస్తూ.. అమరులను స్మరిస్తూ..

Rrr janani song a soulful melody that pays ode to india s freedom movement

RRR, Jr NTR, Ram Charan, rrr Janani song, rrr janani video song, Janani song, Janani video, Janani music video, Alluri sitaramaraju, ss rajamouli, rrr video, rrr release date, rrr Jan 7 2022, alia bhatt, Rajamouli Ram charan, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, Ajay devgn, Alia Bhatt, MM keeravani, Tollywood, Entertainment, movies

Director SS Rajamouli on Friday released the music video of the song “Janani” from his upcoming magnum opus RRR, coinciding with the celebration of India’s Constitution Day. “Janani” is an ode to countless sacrifices that were made to secure freedom from the tyranny of the British Raj.

‘ఆర్ఆర్ఆర్’ జనన పాట: భావోద్వేగంతో కట్టిపడేస్తూ.. అమరులను స్మరిస్తూ..

Posted: 11/26/2021 04:10 PM IST
Rrr janani song a soulful melody that pays ode to india s freedom movement

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపోందుతున్న భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం, రణం, రుధిరం’. సంక్రాంతిని పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇక ఇప్పుడు వరుస పెట్టి అప్ డేట్ లు అందిస్తున్న దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. క్రితం రోజున చెప్పినట్టుగానే ఇవాళ చిత్రంలని ‘జననీ’ అనే ఎమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. భావోద్వేగాలతో కూడిన ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చడంతో పాటు సాహిత్యం కూడా అందించడం విశేషం.

దేశభక్తిని ఇమిడివుండే ఈ పాటను స్వయంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వయంగా ఆలపించారు. ఈ వీడియో సాంగ్ లో చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘దోస్తీ’ సహా ‘నాటు నాటు’ పాటలు ప్రేక్షకాదరణ పోందాయి. దీంతో జనని సాంగ్ కూడా అంతకన్నా ఎక్కువ అదరణ పోందుతుందని చిత్రవర్గాలు తెలిపాయి. 'జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్‌ఎస్ రాజమౌళి క్రితం రోజులు పాటను లాంచ్ చేస్తూ రాజమౌళి తెలిపారు.

ఈ పాట కోసం ఎం.ఎం కీరవాణి రెండు నెలలు శ్రమించారని అన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్‌ కూడా రాశారని పేర్కొన్నారు. ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి ‘‘డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్‌ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్‌ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్‌ ఎమోషన్‌ కనిపించదు. కానీ సినిమా సోల్‌ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles