Samantha revealed her 'true friends’ in new post నువ్వు నా లైఫ్ లోకి రావడం అదృష్టం: సామ్ ఎమోషనల్

Samantha talks about how hard times revealed her true friends in new post

Samantha Ruth Prabhu, Samantha Ruth Prabhu pics, Samantha Ruth Prabhu instagram, Samantha, Samantha Ruth Prabhu Naga Chaitanya, Naga Chaitanya, BV Nandini Reddy, Manjula Anagani, Malavika Nair, Naga Chaitanya, Divorce, True friends, Manjula Anagani, Birthday, Nightout pics, Tollywood, Movies, Entertainment

Actor Samantha Ruth Prabhu took to Instagram to wish her best friend Manjula Anagani on her birthday. She wrote that hard times reveal true friends and added that Manjula knows how much she’s loved today.

నువ్వు నా లైఫ్ లోకి రావడం అదృష్టం: సామ్ ఎమోషనల్

Posted: 11/09/2021 04:44 PM IST
Samantha talks about how hard times revealed her true friends in new post

అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తరువాత తన ఒంటరి తనాన్ని మర్చిపోయేందుకు అధిక సమయం తన స్నేహితురాళ్లతోనే గడుపుతోంది సమంత. విడాకుల విషయాన్ని రచ్చ చేసిన సోషల్ మీడియాపై కూకట్ పల్లి కోర్టులో కేసు వేసిన మరుసటి రోజునే తన క్లోజ్‌ ఫ్రెండ్‌ శిల్పా రెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లివచ్చింది. అత్యంత పవిత్రమైన పుణ్యస్థలాలను దర్శించుకున్న అమె.. అక్కడ ప్రత్యేక పూజలను కూడా నిర్వహించింది. తిరిగి వచ్చిన తరువాత కూడా తన తీర్థయాత్ర ఫోటోలను అభిమానులతో కలసి పంచుకుంది.

ఆ తరువాత దీపావళి పండుగను పురస్కరించుకుని మెగా కొడలు, రాం చరణ్ సతీమణి ఉపాసనతో కూడా కలసి సందడి చేసింది. తాజాగా సమంత తన స్నేహితురాలు డాక్టర్‌ మంజుల అనగాని పుట్టిన రోజు వేడుకకి హాజరైంది. ఈ పార్టీకి సమంతతో పాటు లేడీ డైరెక్టర్‌ నందిని రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మంజుల గురించి ఆసక్తికరపోస్ట్‌ పెట్టింది సమంత.

మంజులను ఉద్దేశిస్తూ..నీ లాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే’అని కామెంట్‌ చేసింది. డాక్టర్‌ మంజుల విషయాకొస్తే.. ఆమె ఓ ప్రముఖ గైనకాలజిస్ట్‌. పద్మశ్రీ అవార్డు గ్రహిత కూడా. మల్టీటాలెంటెడ్ అయిన మంజుల వైద్యంతో పాటు పలు రంగాల్లో రాణిస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన అనేక మంది తారలతో ఆమెకు పరిచయాలు ఉన్నాయి.

 
 
 
View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Naga Chaitanya  Divorce  True friends  Manjula Anagani  Birthday  Nightout pics  Tollywood  

Other Articles