Aaha Kalyanam lyrical video from Peddhanna out రజనీ ‘పెద్దన్న’ నుంచి 'ఆహా కల్యాణం' లిరికల్ సాంగ్!

Aaha kalyanam lyrical video from peddhanna out

Peddanna, Annatthe, Aaha Kalyana song, Rajinikanth, Nayantara, Khushbu, Meena, keerthy suresh, D.Imman, Siva, Ramajogayya Sastry, Kollywood, Tollywood, Movies, Entertainment

The makers of Peddhanna released the lyrical video of the song Aaha Kalyanam from the movie starring Kollywood superstar Rajinikanth. The song Aaha Kalyanam is crooned by Nakash Aziz, Anthony Daasan, Vandana Srinivasan whereas the lyrics are penned by Ramajogayya Sastry. Nayanthara, Keerthy Suresh in lead roles.

రజనీ ‘పెద్దన్న’ నుంచి 'ఆహా కల్యాణం' లిరికల్ సాంగ్!

Posted: 11/03/2021 04:36 PM IST
Aaha kalyanam lyrical video from peddhanna out

రజనీకాంత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' సినిమా రూపొందింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, 'అన్నా చెల్లెళ్ల' సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. తెలుగులో ఈ సినిమాకి 'పెద్దన్న' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాను రేపు తమిళ .. తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు. "ఆహా కల్యాణం .. ఆనంద నాదస్వరం .. మోత మోగుతోందే, పందిళ్ల బంధుజనం .. ఊరంతా కోలాహలం .. ఊయలూగుతోందే" అంటూ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దంపడుతూ ఈ పాట సాగుతోంది.

ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. కీర్తి సురేశ్ ను ప్రధానంగా చేసుకుని, రజనీ ..  ఖుష్బూ .. మీనా తదితరులపై ఈ పాటను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. నయనతార .. జాకీ  ష్రాఫ్ .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రల్లో  కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Peddanna  Annatthe  Aaha Kalyana song  Rajinikanth  Nayantara  Khushbu  Meena  keerthy suresh  D.Imman  Siva  Tollywood  

Other Articles