Radhe Shyam teaser unveiled online for fans అభిమానులకు అందని రేంజ్ లో ‘రాధేశ్యామ్’ టీజర్

Radhe shyam teaser prabhas as vikramaditya is mystery personified

Radheshyam, Radheshyam Teaser, Prabhas, Vikramaditya, Pooja Hegde, Radha Krishna Kumar, Justin Prabhakaran, Krishnam Raju, T-series, UV Productions, Vamsi, Pramod, Praseedha, Tollywood, Entertainment, movies

The makers of Radhe Shyam shared the film's teaser and it is intriguing in every way. In the teaser, Prabhas features as a character named Vikramaditya, who claims to "know everything" but he won't tell anyone.

నేను దేవుణ్ణి కాదు.. మీలో ఒక్కన్ని కూడా కాదంటున్న ప్రభాస్

Posted: 10/23/2021 01:35 PM IST
Radhe shyam teaser prabhas as vikramaditya is mystery personified

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రాధే శ్యామ్ చిత్రం ఒక‌టి. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపోందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జనవరి 14న విడుదల చేసేందుకు మేక‌ర్స్ ఇప్పటికే ప్లాన్ చేశారు. దీంతో ఈ చిత్రం నుంచి తాజా సమాచారం ఎప్పుడెప్పుడు అందుతుందా అంటూ వేయి కళ్లతో వేచిచూసిన ప్రభాస్ అభిమానుల కన్నుల పండువగా చిత్రబృందం రాధేశ్యామ్ నుంచి టీజర్ ను వదిలింది. ఫ్యాన్స్ అంచనాలను మించిన రేంజ్ లో టీజర్ ఉంచి.

టీజర్ ప్రారంభంతోనే ప్రభాస్ వాయిస్ వినబడుతోంది. ‘‘నువ్ ఎవరో నాకు తెలుసు.. కానీ ఏది చెప్పను.. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు అది చెప్పను.. నీ ఓటమి నాకు తెలుసు.. కానీ నేను చెప్పను.. నీ చావు నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను.. నాకు అన్నీ తెలుసు.. కానీ నేను ఏదీ చెప్పను. ఎందుకంటే అది మీ ఊహలకు కూడా అందదు.. నా పేరు విక్రమ్ ఆదిత్య.. నేను దేవుడిని కాదు. అలా అని నేను మీలో ఒకడిని కూడా కాదు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.

ఈ డైలాగ్స్ అని వెలువడుతున్న సమయంలో గులాబి పువ్వు పడిపోతున్నట్లు.. ప్రేమతో రాసిన అక్షరాలు వాటి చుట్టూ హృదయ ఆకారం గీసి ఉండటం.. హస్తంలో వున్న సాముద్రికాలు.. చూపుతూనే మరోవైపు ప్రభాస్ పడుకుని, నడుస్తూ వెళ్లే షాట్స్ కట్ చేశారు. ప్రభాస్ స్టైలిష్ లుక్స్‌కి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరిస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుంది. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే ఇందులో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles