Telugu producer RR Venkat passes away at 57 ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత

Telugu producer rr venkat passes away aged 57 due to kidney related ailments

RR Venkat, RR Venkat films, RR Venkat passes away, Telugu producer, RR Venkat no more, RR Venkat passed away, RR Venkat Kidney ailment, South Indian Movies, outhIndianMovies, Sreenu Vaitla, Surender Reddy, Don Seenu, Gopichand Malineni, Kick, Ravi Teja, Tollywood, Movies, Entertainment

Telugu film producer RR Venkat, also known as JV Venkat Phanindra Reddy, breathed his last early morning today, 27 September. The 57-year-old was reportedly hospitalised for kidney-related ailments at a private hospital in Hyderabad.

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత

Posted: 09/27/2021 11:18 AM IST
Telugu producer rr venkat passes away aged 57 due to kidney related ailments

తెలుగు సినీపరిశ్రమలో వ‌రుస విషాదాలు అభిమానుల‌ని శోక‌సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కరోనా వ‌లన కొంద‌రు, అనారోగ్యం వ‌ల‌న ఇంకొంద‌రు క‌న్నుమూసారు. ఇవాళ ఉదయం ప్ర‌ముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ అనారోగ్య కారణాలతో కన్నుమూయడం టాలీవుడ్ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కిడ్నీ సమస్యలతో గతకొంత కాలంగా బాధపడుతున్న ఆయన హైదదాబాద్ లోని గ్యాస్ట్రోఎంటరాలజీ అసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆర్ఆర్ఆర్ వెంక‌ట్‌.. సామాన్యుడు సినిమాతో నిర్మాత‌గా మారాడు.

ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్ మాన్, డమరుకం, పైసా వంటి సినిమాలను నిర్మించారు. వెంకట్ తన ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థను హాలీవుడ్ లోకి కూడా తీసుకెళ్లారు, జొనాథన్ బెన్నెట్ కథానాయకుడిగా ‘డివోర్స్ ఇన్విటేషన్’ అనే సినిమాను నిర్మించారు. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో డైవర్స్ ఇన్విటేషన్ అనే హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు వెంకట్. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఆహ్వానం’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాకు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. వెంక‌ట్ హ‌ఠాన్మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. అలాగే బాలీవుడ్ లోనూ ‘ఏక్ హసీనా థీ’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అవార్డు కూడా అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles