Venkatesh and Rana teaming for Rana Naidu ‘రానా నాయుడు’ కోసం జతకడుతున్న బాబాయ్ అబ్బాయ్..

Venky and rana daggubati s web series announced

Venkatesh, Rana Daggubati, Rana Naidu, Netflix, Rana Naidu news, Rana Naidu updates, Rana Naidu latest, Rana Naidu shoot, Rana Naidu budget, Rana Naidu breaking news, Rana Naidu announcement, Venky and Rana, Venky and Rana news, Venky and Rana web series, Venky and Rana project, Venky and Rana latest, Venky and Rana new announcement, Tollywood, Movies, Entertainment

Venkatesh and Rana teaming for Rana Naidu: Victory Venkatesh has ample experience as an actor and he is the most successful Tollywood actor till date. The veteran actor is keen to work with his nephew Rana Daggubati for a film but it never happened as they could not find the right script.

‘రానా నాయుడు’ కోసం జతకడుతున్న బాబాయ్ అబ్బాయ్..

Posted: 09/22/2021 04:58 PM IST
Venky and rana daggubati s web series announced

తెలుగు ప్రేక్షకుల ఆదరణతో తన ఇంటిపేరునే విక్టరీగా మార్చుకున్న సీనియర్ హీరో వెంకటేష్.. అటు నాగచైతన్యతో, ఇటు వరుణ్ తేజ్ తో కలసి చిత్రాలలో నటించాడు. అయితే పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా ఇప్పటికీ రానా దగ్గుబాటికి మాత్రం తన బాబాయ్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న ఆశ తీరలేదు. అయితే సిల్వర్ స్ర్కిన్ కాకపోతే మారుతున్న కాలంతో పాటు మారుతున్న ప్రేక్షకుల అభిరుచితో బుల్లితెరపైన (ఓటిటి ద్వారా) ఆయన కల త్వరలోనే సాకారం కాబోతుంది.

రానా దగ్గుబాటి, సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇద్దరూ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కోసం కలిసి పని చేయబోతున్నారు. దీనికి సంబంధించి  అధికారిక ప్రకటన ఇవాళ వెలువడింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ పై విడుదల కానుంది. నెట్ ఫ్లిక్స్ ఓటిటి ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ను ప్రసారం చేసేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు వినబడుతున్నాయి. ఈ సందర్భంగా రానా తన ట్విట్టర్ లో పోస్టు పెట్టి తన అభిమానులతో తాజా అప్ డేట్ ను పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఆసక్తికర కామెంట్ చేస్తూ పోస్టును పంచుకున్నారు.

‘‘బాబాయితో స్క్రీన్ పంచుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఆఫ్ స్క్రీన్లో నేను ఆయన్ను ఎంత ప్రేమిస్తానో ఆన్ స్క్రీన్ లో ఒకరినొకరం తలపడతాం’’ అని అన్నారు. ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్ తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ హిందీ, తెలుగు, తమిళభాషల్లో ఒకేసారి ఈ సిరీస్‌ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో నిషా కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తుంది. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ ద‌ర్శకులు. అమెరిక‌న్ క్రైమ్ డ్రామా రాయ్ దొనోవ‌న్ స్ఫూర్తితో ఈ సిరీస్ ని తెర‌కెక్కించారు.  కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో వెంకటేష్, రానా కనిపించి అలరించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Rana Daggubati  Rana Naidu  Netflix  Web series  Venky and Rana  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh