సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులకు అపోలో ఆసుపత్రి గుడ్ న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ హీరోకు పూర్తిగా వెంటిలేటర్ ను తొలగించిన ఆసుపత్రి వైద్యులు.. ఆయన మరో రెండ మూడు రోజుల వ్యవధిలో ఆసుపత్రి నుంచి డిశ్చార్ అవుతారని ఫ్యాన్స్ కు శుభవార్తను అందించారు వైద్యులు. ఆయన త్వరగా కోలుకోవాలని ఎందరో భక్తులు ఎన్నో రకాలుగా దేవుడిని ప్రార్థించారు. కోందరు మోకాళ్ల మొక్కులు కూడా తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వెంటిలేటర్ ను తోలగించిన వైద్యులు ఆయనను మరో మూడు రోజుల్లో డిశ్చార్జీ చేస్తామని చెప్పడం అభిమానులకు ఆనందాన్ని అందించింది.
సెప్టెంబర్ 10న ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. వినాయక చవితి రోజు రాత్రి ఎనిమిది గంటలకు సాయితేజ్ కేబుల్ బ్రిడ్జ్-ఐకియా మార్గంలో బైక్ పై వేగంగా వెళ్తుండగా.. అక్కడ రోడ్డుపై ఇసుక ఉండటంతో అన్ని వాహనాలు నెమ్మెదించగా, ఆయన కూడా బైక్ బ్రేక్స్ అప్లై చేస్తున్న క్రమంలో అది కాస్తా స్కిడ్ అయ్యింది. దీంతో కిందపడిన సాయి తేజ గాయపడ్డాడు. వెంటనే ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమికి చికిత్స అందించారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలోని పెద్దలు అసుపత్రికి చేరుకుని ఆయనను హుటాహుటిన అపోలో హాస్పిటల్‌కు తరలించారు. కాలర్ బోన్ విరిగడంతో దానికి శస్త్రచికిత్స చేశారు.
దాదాపు పది రోజులు వెంటిలేటర్‌పై ఉన్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది. సాయిధరమ్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని, ఇప్పుడు సొంతంగా శ్వాస తీసుకుంటున్నట్టుకూడా పేర్కొన్నారు. రెండు మూడురోజులలో సాయిధరమ్ డిశ్చార్జ్ కానున్నట్టు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుండగా, ఇందులో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఆయన సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more